Begin typing your search above and press return to search.

అంత పర్సనల్ ప్రాబ్లెం ఏంటో?

By:  Tupaki Desk   |   21 May 2018 7:31 AM GMT
అంత పర్సనల్ ప్రాబ్లెం ఏంటో?
X
టాలీవుడ్ లో నెక్స్ జెన్ టాప్ బ్యూటీ అనుకున్న వారిలో మలయాళీ కుట్టి అను ఇమాన్యుయేల్ పేరు కూడా వినిపించింది. గతేడాది ఈమె స్పీడ్ చూస్తే అందరూ ఇది నిజమే అనుకున్నారు కూడా. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్.. మెగా హీరోలతో ఒకే సారి సినిమాలను అందుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది.

కానీ ఈమె ఆనందం అంతలోనే ఆవిరి అయిపోయింది. పవన్ అజ్ఞాతవాసి.. బన్నీ నా పేరు సూర్య.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. మరోవైపు అప్పుడెప్పుడో చేసిన గోపీచంద్ ఆక్సిజన్ కూడా.. ఈమె కెరీర్ కు ఆక్సిజన్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈమె చేతిలో ఉన్న అవకాశాలు కూడా జారిపోవడం కనిపించింది. రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ నుంచి ఈమెను తప్పించారనే టాక్ వినిపించగా.. అను స్వయంగా తనే వైదొలగిందని.. తాము తప్పించలేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆమె పర్సనల్ ప్రాబ్లెమ్స్ కారణంగా.. సినిమా నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం అను ఇమాన్యుయేల్ కు ఇంటిలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయట. ఆ పర్సనల్ ప్రాబ్లెమ్స్ కారణంగానే.. తొలి దశలోనే ఉన్న ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే తాను కొత్త సినిమా అంగీకరించలేనని చెప్పిందట అను ఇమాన్యుయేల్. నాగ చైతన్య మూవీ శైలజా రెడ్డి అల్లుడు మాత్రం కొంత భాగం షూటింగ్ చేయడంతో.. ఈ సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తోందట అను. ఇంతకీ ఈ అందాల భామకి అంత పర్సనల్ ప్రాబ్లెం ఏంటనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.