Begin typing your search above and press return to search.
శిరీష్ తో డేటింగ్ వార్తలపై.. అమ్మ ఫీలైంది
By: Tupaki Desk | 6 Nov 2022 1:30 PM GMTపెద్దగా అంచనాలు లేని చిన్న సినిమాలు ఒక్కోసారి వచ్చే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. మేకింగ్ సమయంలోనూ.. విడుదల వేళలోనూ పెద్దగా అంచనాలు లేని ఉర్వశివో.. రాక్షసివో మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం పాజిటివ్ బజ్ తో సాగుతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో దాదాపు పది సినిమాలు ఒకే శుక్రవారం విడుదలైనా.. అంత పోటీలో నిలిచిన ఏకైక మూవీగా దీన్ని చెప్పాలి.
అల్లు శిరీశ్.. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ మూవీ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా రూపొందించారు. యూత్ ను బాగా అట్రాక్టు చేసే ప్రేమ.. డేటింగ్ లాంటి అంశాలతో రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తొలిసారి అనూ.. అల్లు శిరీష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీరి ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద బాగా కుదిరిందని చెబుతున్నారు. పలువురు హీరోలతో అనూ నటించినా.. ఈ మూవీ ఆమెకు మరింత మైలేజీ ఇచ్చిందని.. యూత్ బాగా ఆమెకు కనెక్టు అయ్యేలా ఆమె పాత్ర ఉందంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ టైంలో ఈ ఇద్దరి మధ్య ఆఫ్ లైన్ కెమిస్ట్రీ బాగా వర్కువుట్ అయ్యిందని.. వీరిద్దరి మధ్య రిలేషన్ డేటింగ్ వరకు వచ్చినట్లుగా గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. దీనిపై తాజాగా అనూ రియాక్టు అయ్యింది. అల్లు శిరీశ్ తో తాను డేటింగ్ లో ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై రియాక్టు అయిన అనూ.. అందులో ఎలాంటి నిజం లేదని.. నటీనటులపై ఇలాంటి వార్తలు రావటం రోటీగా చెప్పారు.
ఇలాంటి వాటిని తాను పెద్దగా పట్టించుకోనని.. కానీ తన తల్లి మాత్రం ఈ వార్తల్నిచదవి చాలా బాధ పడినట్లుగా చెప్పింది. తెలుగులో నటీనటుల మధ్య డేటింగ్ లాంటి గాసిప్ లు రావటం చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా.. వాటిని ప్రస్తావిస్తూ రియాక్టు అయ్యే నటీమణులు తక్కువగా ఉంటారు. ఇందుకు భిన్నంగా అనూ మాత్రం ఓపెన్ కావటమే కాదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందని చెప్పాలి. మరి.. ఇప్పటికైనా ఈ గాసిప్ జోరు తగ్తుతుందేమో చూడాలి.