Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : పర్ఫెక్ట్ టైమింగ్ తో టాప్ లేపేస్తుంది..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 12:30 PM GMT
ఫోటో స్టోరీ : పర్ఫెక్ట్ టైమింగ్ తో టాప్ లేపేస్తుంది..!
X
మళయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ నాని మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా అమ్మడికి ఒక్కసారిగా లక్కీ ఆఫర్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో నటించిన అమ్మడు.. అల్లు అర్జున్ నా పేరు సూర్యతో కూడా ఛాన్స్ అందుకుంది. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అవడంతో అనుకి ఛాన్సులు లేకుండాపోయాయి. ఎలాగైనా తెలుగులో మళ్లీ తన సత్తా చాటాలనే ఆలోచనతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అను ఇమ్మాన్యుయెల్ లేటెస్ట్ గా అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో సినిమాతో మెప్పించింది.

సినిమాలో అమ్మడి గ్లామర్ షోకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అల్లు శిరీష్ సినిమా ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా కార్తీ హీరోగా వస్తున్న ఒక సినిమాలో ఛాన్స్ అందుకుంది. జపాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతో అను కెరియర్ మళ్లీ ఊపందుకునేలా ఉంది.

ఊర్వశివో రాక్షసివో సినిమా ఇచ్చిన కిక్ తో మళ్లీ వార్తల్లో నిలుస్తుంది అను. ఇక ఇదే పర్ఫెక్ట్ టైం అనుకుని అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా అను ఇమ్మాన్యుయెల్ గోల్డ్ కలర్ శారీ.. వైట్ స్లీవ్ లెస్ జాకెట్ తో అదరగొట్టేస్తుంది. గ్లామర్ షోలో మొహమాటాలేవి లేవన్నట్టు అంతకుముందే హింట్ ఇచ్చిన ఈ అమ్మడు శారీ లుక్స్ తో కూడా సత్తా చాటుతుంది.

టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్స్ కి బ్యాడ్ లక్ వెంటాడుతుంది. ఈ లిస్ట్ లో అను ఇమ్మాన్యుయెల్ ఉంటుంది. అయితే అల్లు హీరో సినిమాతో అమ్మడికి సెకండ్ లక్కీ ఛాన్స్ దొరికినట్టే అయ్యింది. క్యారక్టర్ నచ్చితే చాలు సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అనేలా కోపరేట్ చేస్తున్న అను లాంటి హీరోయిన్స్ కి ఖచ్చితంగా ఆఫర్లు రావాలి. అల్లు బ్రదర్స్ ఇద్దరితో నటించిన అను అల్లు ఫ్యామిలీ సపోర్ట్ తోనే తెలుగులో నిలదొక్కుకోవాలని చూస్తుంది.

ఓ పక్క తన సినిమా థియేటర్ లో సందడి చేస్తుంటే అను ఇలా ఫోటో షూట్స్ తో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవాలని చూస్తుంది. తప్పకుండా అను ఇమ్మాన్యుయెల్ కి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం. చేస్తున్న సినిమా ఏదైనా గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అని అదరగొడుతున్న అను ఇమ్మాన్యుయెల్ సౌత్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలని డ్రీం గట్టిగానే ఉన్నట్టు అర్ధమవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.