Begin typing your search above and press return to search.
భారతీయ అమ్మాయిల్లా కాదు - నేను కాస్త హాట్
By: Tupaki Desk | 7 Sep 2018 12:07 PM GMT‘మజ్ను’ చిత్రంలో నానికి జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ స్టార్ డంను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా భావించారు. కాని ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడం - ఆ తర్వాత నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం కూడా నిరాశ పర్చడంతో అను ఇమ్మానుయేల్ కు టాలీవుడ్ లో ఎదురు గాలి మొదలైంది. రెండు వరుస ఫ్లాప్ ల కారణంగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో వచ్చిన అవకాశం చేజారి పోయింది. తాజాగా ఈమె నటించిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా అను తన బాడీపై, బాడీ లాంగ్వేజ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్ అయ్యాయి.
అను ఇమ్మానుయేల్ అమెరికాలో పుట్టి పెరిగిన పెరిగిందట. సినిమాల్లో ఆఫర్లు రావడం వల్ల తాను ఇక్కడకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. అమెరికాలో పుట్టి పెరగడం వల్ల ఇండియన్ అమ్మాయిలు కూర్చున్నట్లుగా కూర్చోవడం, వారి బాడీ లాంగ్వేజ్ లా తన బాడీ లాంగ్వేజ్ రాదని అను ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చింది. నేను నడిచే విధానం కూడా సగటు ఇండియన్ అమ్మాయి నడకకు విభిన్నంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. నా బాడీ లాంగ్వేజ్ మరియు నా నడక కాస్త హాట్ గా ఉంటుందని - ఇదంతా కూడా తాను అమెరికాలో పెరిగిన వాతావరణ ప్రభావం అంటూ చెప్పుకొచ్చింది.
ఈమద్య కాలంలో తాను తన బాడీలాంగ్వేజ్ మరియు నడకను - కూర్చునే విధానంను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తన మాట తీరు మాత్రం ఇండియన్ మాట తీరులాగే ఉంటుందని అను చెబుతోంది. నేను ఎక్కువగా మాట్లాడేందుకు ఆసక్తి చూపించను. ఎదుటి వారు మాట్లాడుతూ ఉంటే వింటాను తప్ప ఎక్కువగా స్పందించను. ఒకవేళ మాట్లాడటం మొదలు పెడితే మాత్రం ఆ తర్వాత నాకు నేనే షాక్ అవుతాను అంటోంది. తన నిజ జీవితంకు శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో పోషించిన పాత్రకు పూర్తి విరుద్దం అంటూ అను చెప్పింది. ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ఫలితంపై ఈమె కెరీర్ ఆధారపడి ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శైలజ రెడ్డి అల్లుడు ఫలితం అనుకు ఎలాంటి జ్ఞాపకాలను మిగుల్చుతుందో చూడాలి.