Begin typing your search above and press return to search.

కీర్తి తరువాత అను మొదలెట్టింది

By:  Tupaki Desk   |   29 Nov 2017 10:14 AM GMT
కీర్తి తరువాత అను మొదలెట్టింది
X
ఒక హీరోయిన్ కోసం సాధారణంగా ఒక పర్టికులర్ వాయిస్ కలిగిన అమ్మాయితో డబ్బింగ్ చెప్పించడం మనోళ్ళకు అలవాటు. అనుష్క కోసం సౌమ్య శర్మ.. ఆర్తి అగర్వాల్ కోసం సవితా రెడ్డి.. నదియా కోసం రోజారమణి.. సమంత కోసం చిన్మయి.. ఇలా చాలామంది నోటెడ్ నేమ్స్ ఉన్నారు. అయితే ఎప్పుడన్నా ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు హ్యాండ్ ఇస్తే మాత్రం హీరోయిన్లకు బ్యాడ్ నేమ్ కూడా వచ్చే చాన్సుంది.

నిజానికి డబ్బింగ్ ఆర్టిస్టులు హ్యాండ్ ఇవ్వడం అనే సంగతి పక్కన పెట్టేస్తే.. అసలు తమ సొంత వాయిస్ లేకుండా వేరొకరు చెప్పడం కారణంగా.. హీరోయిన్లకు ఐడెంటిటీ పోయిందనే ఫీలింగ్ వస్తోందట. అందుకే తాజాగా యంగ్ హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు. బాష రాకపోయినా కూడా పవన్ కళ్యాణ్‌ 25వ సినిమా కోసం కీర్తి సురేష్‌ ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేసింది. ఇప్పుడు అదే సినిమాలో గ్లామర్ తారగా అందాలను ఆరబోస్తున్న అను ఎమ్యానుయేల్ కూడా మొదలెట్టింది.

విశేషం ఏంటంటే.. సాధారణంగా తన సినిమాల వివరాలను గోప్యంగా ఉంచే త్రివిక్రమ్.. ఈ సినిమా విషయంలో.. అది కూడానూ ఈ హీరోయిన్ల విషయంలో మాత్రం.. ఇద్దరినీ డబ్బింగ్ చెబుతున్నట్లు ఫోటో తీసుకుని ట్విట్టర్లో పోస్ట్ చేసుకోనిచ్చాడు.