Begin typing your search above and press return to search.
‘అజ్ఞాతవాసి’పై చాలా ఆశలు పెట్టుకున్నా
By: Tupaki Desk | 4 May 2018 4:03 AM GMTతెలుగులో కేవలం రెండు సినిమాల అనుభవంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో పని చేసే అవకాశం దక్కించుకుంది అను ఇమ్మాన్యుయెల్. అందులోనూ ఆమె ముందుగా నటించింది నాని.. రాజ్ తరుణ్ లాంటి హీరోలతో చేసిన చిన్న సినమాలతో. అలాంటి హీరోల తర్వాత పవన్ సరసన అవకాశం రావడం గొప్ప విషయమే. ఈ దెబ్బతో అను రేంజే మారిపోతుందని అంతా అనుకున్నారు. ఐతే ‘అజ్ఞాతవాసి’లో చేస్తుండటం వల్ల ‘నా పేరు సూర్య’లో ఛాన్స్ వచ్చింది కానీ.. పవన్ సినిమా విడుదల తర్వాత మాత్రం ఆమెకు నిరాశే మిగిలింది. ‘అజ్ఞాతవాసి’ ఆమె ఆశల్ని అడియాసలు చేసింది. ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసింది అను ఇమ్మాన్యుయెల్.
‘‘తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయంలోనే పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ‘అజ్ఞాతవాసి’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ అది ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో చాలా బాధపడ్డా. కానీ ఆ బాధ మరీ ఎక్కువ కాలం లేదు. ‘నా పేరు సూర్య’ లాంటి మరో పెద్ద సినిమాలో నటించడంతో ఆ బాధ తగ్గింది. ఇలాంటి పరాజయాలు ఎదురైనప్పుడే విజయాలు వెతుక్కుంటూ వస్తాయి. ‘నా పేరు సూర్య’లో నటించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇందులో నేను వర్ష అనే ఆర్ట్స్ విద్యార్థి పాత్రలో నటించా. ఆర్మీ ఆఫీసర్ అయిన బన్నీ విహారయాత్ర కోసం వచ్చినపుడు నన్ను చూస్తాడు. నా నిజ జీవితానికి ఈ పాత్ర చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే త్వరగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో నాకు సంబంధించిన సన్నివేశాలు దాదాపు బన్నీతోనే ఉంటాయి. సినిమా చూశాక ప్రేక్షకులు ఎలా ఫీలవుతారోనని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని అను చెప్పింది.