Begin typing your search above and press return to search.

వరుస ఫ్లాప్స్ పడ్డా అనుకి మరోసారి గుడ్‌ టైమ్‌..!

By:  Tupaki Desk   |   12 Nov 2022 11:30 PM GMT
వరుస ఫ్లాప్స్ పడ్డా అనుకి మరోసారి గుడ్‌ టైమ్‌..!
X
నాని హీరోగా నటించిన మజ్ను సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌ తక్కువ సమయంలోనే అల్లు అర్జున్‌ మరియు పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్‌ హీరోలతో నటించే అవకాశంను దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన మెజార్టీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

వరుస ఫ్లాప్స్ కారణంగా టాలీవుడ్‌ లో ఒకానొక సమయంలో ఆఫర్స్ లేకుండా అను ఎమాన్యూల్‌ కెరీర్ ను నెట్టుకు వచ్చింది. ఈ సమయంలో మళ్లీ ఈ అమ్మడు ఆఫర్స్‌ దక్కించుకోవడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మడి యొక్క కెరీర్ ఖతం అయినట్లే అనుకుంటూ ఉండగా తాజాగా వచ్చిన అల్లు శిరీష్ యొక్క ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే నమోదు చేయలేక పోయింది. అయినా కూడా అను ఎమాన్యూల్‌ కి అనూహ్యంగా వరుసగా మంచి ఆఫర్స్‌ టాలీవుడ్‌ నుండి తలుపు తడుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం మహేష్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఈ అమ్మడికి సెకండ్‌ హీరోయిన్‌ గా ఛాన్స్ దక్కిందట. అందుకు సంబంధించిన చర్చలు మరియు సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీఆర్‌ 30 సినిమాలో కూడా ఈ అమ్మడి యొక్క పాత్ర ఉండబోతుందట.

మొత్తానికి వరుసగా ఫ్లాప్స్ పడ్డ తర్వాత కూడా ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌ లో ఆఫర్స్ ను దక్కించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. అను ఎమాన్యూల్‌ నిజంగానే ఈ ఇద్దరి సినిమాల్లో కనీసం సెకండ్‌ హీరోయిన్‌ పాత్రను దక్కించుకున్నా కూడా కచ్చితంగా టాలీవుడ్‌ లో మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉందని.. గుడ్‌ టైమ్‌ స్టార్ట్ అయినట్లే అని జనాలు మాట్లాడుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.