Begin typing your search above and press return to search.

అనూ బేబీ రిలేషన్ షిప్ లో ఉందా లేదా..?

By:  Tupaki Desk   |   2 Nov 2022 4:30 PM GMT
అనూ బేబీ రిలేషన్ షిప్ లో ఉందా లేదా..?
X
సినీ ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు కలిసి క్లోజ్ గా కనిపించినా వారి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని అందరూ చెవులు కోరుకుంటారు. ఒక్కోసారి ఆ వార్తలను నిజం చేసిన జంటలు కూడా ఉన్నాయి.

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో డేటింగ్ రూమర్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట యంగ్ హీరో అల్లు శిరీష్ మరియు గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ అని చెప్పాలి. 'ఊర్వశివో రాక్షసివో' సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని నెట్టింట తెగ పుకార్లు పుట్టుకొచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనూ తో రిలేషన్ పై అల్లు శిరీష్ స్పందించారు. ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నప్పుడు అలాంటివి రావడం కామన్ అని సింపుల్ గా చెప్పేసారు. 'ఊర్వశివో రాక్షసివో' ట్రైలర్ లో షాట్స్ చూసి అలా అనుకొని ఉండొచ్చని.. అంతేకానీ తాము డేటింగ్ చేయడం లేదని రూమర్స్ ను కొట్టిపారేశాడు శిరీష్.

అయితే తాజాగా అల్లు శిరీష్ తో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అను ఇమ్మాన్యుయేల్ తన ప్రెజెంట్ రిలేషన్ షిప్ స్టేటస్ పై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ''మీరు సింగిల్ గా ఉన్నారా? రెడీ టూ మింగిలా?'' అని హోస్ట్ ప్రశ్నించారు.

సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. డిస్కషన్ ఎందుకులే అని దాదాపు అందరూ సింగిల్ అని చెప్తుంటారు.. ఎవరో కొందరు మాత్రమే తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతుంటారు.

ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ కూడా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పడానికి చాలా ఇబ్బంది పడింది. ఆల్రెడీ లవ్ లో ఉందా? ఇంకా సింగిల్ గానే ఉందా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా.. ఎంతో సిగ్గుపడుతూ 'నాకు తెలియదు.. చెప్పకూడదు' అనేసింది.

అయితే పక్కనున్న అల్లు శిరీష్ 'అను సింగిలా?' అనే ప్రశ్నకు 'నో' అనే సైన్ బోర్డు చూపించడంతో.. దీనిపై అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని సూచించింది. అనూ నే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదా? అని డౌట్ ఫుల్ గా ఉంటే.. ఇంత కంఫర్మ్ గా 'నో' అని ఎందుకు అన్నావ్?' అని శిరీష్ ను యాంకర్ ప్రశ్నించాడు.

అనూ ప్రేమలో ఉందని గెస్ చేశానని.. ఎప్పుడు చూసినా ఆమె తన మొబైల్ చూసుకొని ముసిముసిగా నవ్వుకుంటుందని.. కొన్ని సార్లు సిగ్గుపడుతుందని.. అందుకే అలా అనిపించిందని అల్లు శిరీష్ తెలిపారు. అయితే ఫోన్ లో ఏదైనా చూసి నవ్వుతున్నానంటే అది తన అమ్మ కావొచ్చు లేదా ఫ్రెండ్ కావొచ్చు అని అనూ చెప్పింది.

కాస్త సీరియస్ గా 'తెలియదు అంటే ఎందుకు చెప్పాలి?' అంటూ అనూ బేబీ తన రిలేషన్ షిప్ పై ఎటూ తేల్చుకోలేని సమాధానం చెప్పింది. అను ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉన్నట్టు గతంలోనూ రూమర్లు వచ్చాయి కానీ.. ఎప్పుడూ వాటిని ఖండించలేదు. ఇప్పుడు కూడా అలాంటి జవాబే చెప్పింది.  

ఇకపోతే 'ఊర్వశివో రాక్షసివో' సినిమాపై అల్లు శిరీష్ మరియు అను ఇద్దరూ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుందని నమ్ముతున్నారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.