Begin typing your search above and press return to search.
#మీటూ:పాయింట్ జిప్ తీసి అసభ్యంగా...
By: Tupaki Desk | 21 Oct 2018 6:12 AM GMTఇన్నాళ్లు పెద్ద మనుషులుగా చెలామణి అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు పరువు పోగొట్టుకుని నేల చూపులు చూస్తున్నారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది మహిళలు మరియు సెలబ్రెటీలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను మీడియా ముందుకు వచ్చి చెబుతున్న నేపథ్యంలో స్టార్స్ గా పేరు దక్కించుకున్న వారు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక కొందరు ఇంట్లోంచి బయటకు వెళ్లడం లేదు, మరి కొందరు మాత్రం తమపై బురద జల్లుతున్నారంటూ తిరిగి ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ఇప్పటికే అను మాలిక్ పై సింగర్స్ సోనా మహాపాత్ర - శ్వేత పండిత్ లు లైంగిక వేదింపుల ఆరోపణలు చేశారు. ఆయన తమ పట్ల చాలా దారుణంగా వ్యవహరించాడు అంటూ వారిద్దరు స్వయంగా మీడియా ముందు చెప్పారు. దాంతో ఆయనతో వర్క్ చేసేందుకు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల వారు ఆసక్తి చూపడం లేదు. ఇదే సమయంలో మరింత ఘాటుగా ఈసారి ఒక మహిళ అను మాలిక్ పై ఆరోపణలు చేయడంతో మరింతగా ఆయన్ను చిత్కరిస్తున్నారు.
తన పేరు బయట పెట్టేందుకు ఇష్టపడని ఒక మహిళ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 1990 వ సంవత్సరంలో తాను మెహబూబా స్టూడియోలో అను మాలిక్ ను కలిశాను. ఆ సమయంలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సారీ చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నన్ను ఇంటికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు అర్థం అయ్యింది ఏంటీ అంటే అక్కడ ఎవరు లేరు - నన్ను లైంగికంగా వేదించాలని ఆయన భావిస్తున్నాడని అనిపించింది. అతడు నా వద్దకు వచ్చి అతడి జిప్ తీయడంతో పాటు - నా స్కర్ట్ ను పైకి ఎత్తే ప్రయత్నం చేశాడు. నన్ను బలవంతం చేయబోతున్న సమయంలో అదృష్టం బాగుండి కాలింగ్ బెల్ మోగింది. దాంతో నేను బయట పడ్డాను. ఈ విషయం ఎవరితో అయినా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని ఆమె చెప్పుకొచ్చింది.