Begin typing your search above and press return to search.
ఆహా అనిపించుకుంటున్న 'అనుభవించు రాజా'..!
By: Tupaki Desk | 17 Dec 2021 4:46 PM GMTతెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టిన ప్రాంతీయ ఓటీటీ 'ఆహా'. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా ఫ్రెష్ కంటెంట్ ను అప్లోడ్ చేస్తూ.. అనతి కాలంలోనే విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో దిగ్గజ ఓటీటీలకు ధీటుగా నిలుస్తోంది. కొత్త సినిమాలు - ఒరిజినల్ వెబ్ సిరీస్ లతో పాటుగా స్పెషల్ టాక్ షోలు స్ట్రీమింగ్ చేస్తుండటం ఆహా ప్రత్యేకత. న్యూ వెర్షన్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ.. ఈ డిసెంబర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు (డిసెంబర్ 17) ఆహా వేదికగా ''అనుభవించు రాజా'' సినిమాని వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేశారు.
యువ హీరో రాజ్ తరుణ్ - కషికా ఖాన్ జంటగా తెరకెక్కించిన చిత్రం 'అనుభవించు రాజా'. శ్రీను గావిరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ - శ్రీ వేంకటేశ్వర సినిమాస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ నవంబర్ 26న థియేట్రికల్ రిలీజ్ కాబడి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఆహా వేదికగా అలరించడానికి వచ్చింది.
కథ విషయానికొస్తే.. పెద్దింట్లో పుట్టి పెరిగిన బంగారం అలియాస్ రాజు (రాజ్ తరుణ్).. తన తాత చివరి క్షణాల్లో చెప్పిన మాటలు విని అనుభవించు రాజా అంటూ జల్సారాయుడిగా మారతాడు. అనుభవించడానికే పుట్టానన్నట్టుగా కోడిపందేలు - పేకాట వంటి జూదాలు - సరదాలతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఊరికి ప్రెసిడెంట్ కావాలనుకున్న బంగారం.. ఎన్నికల హడావుడిలో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య ఎవరు చేశారు? ఊళ్లో జల్సాగా తిరిగే బంగారం సిటీలో సెక్యూరిటీ గార్డ్ ఎలా అయ్యాడు? హీరోయిన్ తో అతడి ప్రేమాయణం ఎలా సాగింది? హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డాడా లేదా? అనేది 'అనుభవించు రాజా' కథ.
థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో కూడా ఆకట్టుకుంటోంది. ఎనర్జిటిక్ పాత్రలకి పెట్టింది పేరైన రాజ్ తరుణ్.. బంగారం పాత్రలో ఓ జల్సారాయుడిలా చేసిన అల్లరి ప్రేక్షకులను అలరిస్తోంది. గోపీ సుందర్ సమకూర్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి - ఆడుకాలమ్ నరేన్ - అజయ్ - సుదర్శన్ - టెంపర్ వంశీ - ఆదర్శ్ బాలకృష్ణ - రవి కృష్ణ - భూపాల్ రాజు - అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జల్సాల గురించి.. పల్లెటూళ్ళు మరియు కుటుంబ బంధాల గురించి సందేశం ఇస్తున్న 'అనుభవించు రాజా' సినిమా.. ఆహా ఓటీటీలో రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుందో చూడాలి.