Begin typing your search above and press return to search.
లిరికల్ వీడియో: వయసులో ఉన్నప్పుడే అన్నీ అనుభవించే రాజా!
By: Tupaki Desk | 11 Oct 2021 7:03 AM GMTరాజ్ తరుణ్ హీరోగా గవిరెడ్డి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా-`అనుభవించు రాజా`. అన్నపూర్ణ స్టూడియోస్ - శ్రీవెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టైటిల్ కి తగ్గట్టే ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ఆహార్యం రొమాంటిక్ గా ఉంటుందని తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ చెబుతోంది.
గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.``రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా`` అంటూ పాట సాగుతోంది. ``అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ .. కల్లుకైనా కనికరించవా .. మందుకైనా మన్నించవా`` .. ``మొలతాడైనా మనతో రాదు .. అవకాశం ఉన్నప్పుడే అన్నీ అనుభవించేయ్..`` అంటూ రాజ్ తరుణ్ క్యారెక్ట్ ఎలా ఉండనుందో విజువలైజ్ చేసి చూపించారు. డిఫరెంట్ గెటప్స్ లో విలేజ్ ఆకతాయి కుర్రాడిగా రాజ్ తరుణ్ ఆహార్యం సూటబుల్ గా కనిపిస్తోంది.
భాస్కరభట్ల ఈ చిత్రానికి సాహిత్యం అందించగా.. రామ్ మిరియాల ఆలపించాడు. విలేజ్ లో జాతర వాతావరణంలో పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా భాస్కర భట్ల పదజాలం మాయ చేసిందనే చెప్పాలి. చాలా కాలంగా రాజ్ తరుణ్ సరైన విజయం కోసం వేచి చూస్తున్నాడు. ఈ సినిమాతో పెద్ద హిట్టు కొడతాడనే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.