Begin typing your search above and press return to search.

పోటీ తప్పకుండా ఉండాలి

By:  Tupaki Desk   |   30 Dec 2017 5:30 PM GMT
పోటీ తప్పకుండా ఉండాలి
X
టాలీవుడ్ లో ప్రస్తుతం సంగీత దర్శకుల మధ్య పోటీ చాలానే ఉంటుంది. ఎవరు బిజీ అవుతున్నా కాకపోతున్నా సంగీత దర్శకులు మాత్రం చాలా బిజీ అవుతున్నారు. కొందరు దర్శకులు హీరోలు వారికి నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లతోనే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ కూడా ఉన్నాడు. కీ బోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేసిన అనూప్ జై సినిమాతో మొదటి అవకాశాన్ని దక్కించుకొని రీసెంట్ గా వచ్చిన హలో సినిమాతో 50 సినిమాలను పూర్తి చేసుకున్నాడు.

కెరీర్ మొదట్లో కొంత తడబడ్డ అనూప్ ఇష్క్ సినిమాతో గాడిలో పడ్డాడు. ఆ తరువాత గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఒక ట్రాక్ సెట్ చేసుకొని ఫుల్ బిజీ అయిపోయాడు. అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటికి గుర్తుండి పోయే మనం సినిమాకు పాటలను అందించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోకు కూడా గోపాల గోపాల - కాటమరాయుడు అనే సినిమాలకు మెలోడీ ప్లస్ మాస్ మాటలను అందించాడు. అయితే రీసెంట్ గా ఈ యువ టెక్నీషియన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన 50 సినిమాల కెరీర్ ను గుర్తు చేసుకున్నాడు.

అనూప్ మాట్లాడుతూ..నేను సక్సెస్ ఫుల్ గా 13 ఏళ్లలో 50 సినిమాలను పూర్తి చేశాను అంటే అది నా ఒక్కడి విజయం కాదు. నాతో వర్క్ చేసిన సింగర్స్ కి అలాగే దర్శకులకు కూడా భాగం ఉంది. నిజంగా వారందరికీ నేను ఋణపడి ఉంటాను. ప్రతి సినిమా నాకు ఒక పాఠాన్ని నేర్పింది. పోటీ అనేది తప్పకుండా ఉండాలి. లేకుంటే మంచి అవుట్ ఫుట్ రాదు. ఛాలెంజ్ అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా రీ రికార్డింగ్ చేయడం చాలా కష్టం. హలో సినిమాకు అందుకు చాలా శ్రమించాను.

రిజల్ట్ చూసిన తరువాత ఫలితం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన దర్శకుల్లో విక్రమ్ కె కుమార్ బెస్ట్. ఆయనతో మూడు సినిమాలను చేశాను. ఏదైనా సరే చాలా క్లియర్ గా చెప్పేస్తారు. ఆయనతో నాకు మంచి రిలేషన్ ఉంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ - థమన్ లను అప్పుడపుడు కలుస్తుంటా. మణిశర్మ గారు కూడా నేను చేసిన పాటలు నచ్చితే ఫోన్ చేసి బాగా చేశావ్ అని ప్రశంసలను అందిస్తారని అనూప్ వివరించాడు.