Begin typing your search above and press return to search.
ఆ సినిమాలో రాహుల్-ప్రియాంక వీళ్లే..
By: Tupaki Desk | 28 Jun 2018 12:26 PM GMTబాలీవుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సెటైర్ మూవీ తెరకెక్కుతోందిప్పుడు. ఆ సినిమా పేరు.. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశించి తీస్తున్న సినిమా. యూపీయే ప్రభుత్వ హయాంలో పాలసీ అనలిస్టుగా ఉన్న సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అనుపమ్ ఖేర్.. మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. మన్మోహన్ అవతారంలోకి ఆయన మారిన తీరు.. అచ్చంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ను ఇమిటేట్ చేస్తూ రిలీజ్ చేసిన ఫొటోలు.. వీడియోలు ఆశ్చర్యం కలిగించాయి. తాజాగా ఈ చిత్రంలో మరో రెండు కీలక పాత్రల్లో నటిస్తున్న ఆర్టిస్టుల్ని ఆయన పరిచయం చేశాడు. మన్మోహన్ మీద సినిమా అంటే అందులో రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీల పాత్రలు లేకుండా ఎలా ఉంటాయి?
అవును.. ఆ పాత్రలు సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. ఆ క్యారెక్టర్లలో అర్జున్ మాథుర్.. అహానా ఖురానా కనిపించబోతున్నారు. వారితో తాను కలిసి ఉన్న ఫొటోను అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో షేర్ చేశాడు. వాళ్ల లుక్స్ రాహుల్.. ప్రియాంకలను తలపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని విజయ్ గట్టర్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. భాజపాకు గట్టి మద్దతుదారైన అనుపమ్ ఖేర్ కు కాంగ్రెస్ పార్టీ అంటే పడదు. ఆయన అనేక సందర్భాల్లో కాంగ్రెస్ రాజకీయాల్ని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ.. సోనియా గాంధీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన్మోహన్ ను ప్రధానిగా చేసి.. తెర వెనుక రాజకీయం నడిపిన సోనియా గాంధీ మీద సెటైర్లు వేయడానికి.. మొత్తంగా కాంగ్రెస్ రాజకీయాల తీరును ఎండగట్టడానికే ఆయన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా చేస్తున్నాడన్న అభిప్రాయాలున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండటమే కాదు.. తనే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు అనుపమ్ ఖేర్.