Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కి కోలీవుడ్ ఆదర్శం కావాలా?
By: Tupaki Desk | 17 Dec 2015 1:30 PM GMTబాలీవుడ్ సినిమాలు పబ్లిసిటీ కోసం చాలా ఎత్తుగడలు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఖాన్ త్రయం ఈ విషయంలో చాలా ముందుకెళ్లిపోయారు. పబ్లిసిటీతో అంచనాలకు మించిన విజయాలు సాధించచ్చని.. అమీర్ ఖాన్ చాలాసార్లే నిరూపించాడు. బాలీవుడ్ కి పాఠాలు నేర్పాడు. ఇప్పుడీ సూత్రాలను హిందీ ఫిలిం ఇండస్ట్రీ ఫాలో అయిపోతోంది. ఎంతగా అంటే.. సినిమా నిర్మాణ ఖర్చులో ప్రచారం ఓ మేజర్ అయిపోయింది. ఇప్పుడీ పబ్లిసిటీ కాస్ట్ శృతి మించిపోతోందనే చెప్పాలి. ప్రచారం కోసం చేపట్టిన కార్యక్రమాల్లో.. పక్కన తిరిగే పరివారం కోసమే కోట్లు వెచ్చించాల్సి వస్తోంది.
రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొనేలు నటించిన బాజీరావు మస్తానీ చిత్రం కోసం విపరీతమైన పబ్లిసిటీ చేశారు. ఈ ప్రచారం కోసం అయిన ఖర్చు ఎంతో చెప్పలేం కానీ.. హీరో హీరోయిన్ల వెంట ఉండేవారి కోసమే అక్షరాలా కోటి రూపాయలు వెచ్చించారట. దీనిపై బాలీవుడ్ రైటర్ - జర్నలిస్ట్ కం క్రిటిక్ అనుపమా చోప్రా విమర్శలు గుప్పించింది. "ప్రస్తుతం ఉన్నత స్థాయి మేకప్ మ్యాన్ ని తీసుకుంటే రోజుకు 75 వేలు అవుతోంది, సాధారణ మేకప్ కోసమైనా 30వేలు వెచ్చించాలి. హెయిర్ - మేకప్ స్టైలిస్ట్ కి 30 వేలు ఇవ్వాలి, సెక్యూరిటి కోసం పది వేలు ఖర్చు పెట్టాలి. డ్రైవర్లు కూడా రోజుకు 7-8 వేలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిస్టులు రిహార్సల్స్ కోసం వచ్చినపుడు కూడా ఈ ఖర్చులన్నీ నిర్మాతలపైనే మోపుతున్నారు. ఇవేవీ సినిమా క్వాలిటీ కోసం సహాయపడవు. వీలైనంతగా ఇలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి" అంటున్నారు అనుపమ చోప్రా.
ఈమె ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ విధు వినోద్ చోప్రా భార్య కూడా కావడం గమనించాల్సిన విషయం. అసలు ఇలాంటి ఖర్చుల విషయంలో కోలీవుడ్ ని ఆదర్శంగా తీసుకోవాలని, మినిమం ప్రచారంతో సరిపెట్టేసి, మిగిలిన భాగమంతా తాము తీసే సినిమాలో క్వాలిటీయే చూసుకుంటుందని నమ్ముతారని అంటోందామె.