Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : నీ నవ్వులే వెన్నెలని.. మల్లెలని హరివిల్లులని..!

By:  Tupaki Desk   |   12 Nov 2022 10:30 AM GMT
ఫోటో స్టోరీ : నీ నవ్వులే వెన్నెలని.. మల్లెలని హరివిల్లులని..!
X
మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మొన్నటిదాకా కెరియర్ లో వెనకపడగా లేటెస్ట్ గా కార్తికేయ 2 హిట్ తో మళ్లీ ఫాం లోకి వచ్చింది. నిఖిల్ సరసన కార్తికేయ 2 లో తన పాత్రతో మెప్పించింది అనుపమ. ఆ సినిమాతో కుదిరిన వీరి కాంబో నెక్స్ట్ సినిమాకు కొనసాగుతుంది. నిఖిల్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో కూడా అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది. కార్తికేయ 2 కాంబో అవడంతో ఈ ప్రాజెక్ట్ కి వాళ్లిద్దరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

ఇదే కాకుండా డీజే టిల్లు సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా అనుపమ లక్కీ ఛాన్స్ అందుకుంది. డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన రాధిక అదే నేహా శెట్టి నటించింది. ఆ సినిమాలో ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది నేహా శెట్టి అయితే డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారు. అనుపమ ఎంట్రీతో ఆ మూవీకి మరింత క్రేజ్ ఏర్పడింది. సినిమాలతో పాటుగా షార్ట్ ఫిలిమ్స్ తో కూడా అనుపమ సత్తా చాటుతుంది. మాతృభాష మళయాళంలో అనుపమ రకరకాల ప్రయోగాలు చేస్తుంది.

అయితే సినిమాలు.. షార్ట్ మూవీస్ మాత్రమే కాదు ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది అనుపమ. అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ఫాలోవర్స్ కి మాంచి కిక్ ఇస్తున్నాయి. పెద్దగా గ్లామర్ షో చేయకపోయినా తన ఛార్మింగ్ తో అలరిస్తుంది అనుపమ.

లేటెస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ షర్ట్.. జీన్స్ ప్యాంట్ తో తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు. నడుము అందాలను చూపిస్తూ అమ్మడి దరహాసానికి అందరు పడిపోవాల్సిందే. అనుపమ లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన నెటిజెన్లు రకరకాల కామెంట్స్ తో హంగామా చేస్తున్నారు.

నీ నవ్వులే వెన్నెలని.. మల్లెలని హరివిల్లులని అంటూ మల్లీశ్వరి సినిమాలో సాంగ్ తో అనుపమని పొగిడేస్తున్నారు. అందాల అనుపమ ఏం చేసినా అందులో ఓ లెక్క ఉంటుంది. కెరియర్ మొదట్లో తన సైజ్ వల్లే తనకు అవకాశాలు రావట్లేదు అనుకున్న అమ్మడు డైటింగ్ గట్రా చేసి సైజ్ జీరోకి వచ్చేసింది.

ప్రస్తుతం తన స్లిమ్ లుక్ తో ఆకట్టుకుంటున్న అనుపమ కంప్లీట్ గా మోడ్రెన్ గాళ్ గా మారిపోయింది. కర్లీ హెయిర్.. కేక పుట్టించే ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెడుతుంది అనుపమ. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో చేస్తున్న ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారబోతుందని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.