Begin typing your search above and press return to search.

శ‌ర్వాతో క‌లిసి ఆరోజు చిరు సినిమా చూసింద‌ట‌!

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:34 AM GMT
శ‌ర్వాతో క‌లిసి ఆరోజు చిరు సినిమా చూసింద‌ట‌!
X
ఇండ‌స్ట్రీలో ఏ హీరోని క‌దిలించినా త‌ను సినిమాల్లోకి రావ‌డానికి మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని చెబుతుంటారు. ఆయ‌న న‌టించిన సినిమాలు చూసి పెరిగామ‌ని, అలాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ కార‌ణంగానే సినిమాల్లోకి వ‌చ్చామ‌ని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా మెగాస్టార్ త‌న‌కు స్ఫూర్తిగా నిలిచార‌ని చెబుతోంది. త‌నే కేర‌ళ చిన్న‌ది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. 'ప్రేమ‌మ్‌' (మ‌ల‌యాళ‌) సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ కేర‌ళ కుట్టి నితిన్ - త్రివిక్ర‌మ్ ల 'అఆ'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం నిఖిల్ హీరోగా న‌టించిన సూప‌ర్ నేచుర‌ల్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ‌2'తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ ల‌పై అభిషేక్ అగ‌ర్వాల్‌, టీజి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా ఆగ‌స్టు 13న విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రిలీజ్ డేట్ లు మారిన ఈ మూవీ ఫైన‌ల్ గా ఆగ‌స్టు 13ని ఫిక్స్ చేసుకుంది.

నితిన్ న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం' ఆగ‌స్టు 12న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో 'కార్తికేయ 2' ని ఓ రోజు ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్నారు. ఇదిలా వుంటే రిలీజ్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా ఓ మీడియాతో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. సినిమాలో త‌న పాత్ర చాలా బోల్డ్ గా వుంటుంద‌ని చెప్పుకొచ్చింది. సినిమా విజువ‌ల్ గా గ్రాండీయ‌ర్ గా వుంటుంద‌ని, ఇదొక విజువ‌ల్ ఎక్స్‌ట్రావ‌గాంజ అని తెలిపింది.

విజువ‌ల్ ట్రీట్ వున్న ఫిలింస్ ని మాత్ర‌మే జ‌నాలు చూడాల‌నుకుంటున్నారని, ఓటీటీలో సినిమా వ‌స్తుందిలే ఇంట్లో కూర్చుని చూడొచ్చులే అనే ఫీల్ కి ఆడియ‌న్స్ వ‌చ్చారు. అయితే థియేట‌ర్ ఇచ్చే ఎక్స్‌పీరియ‌న్స్ వేరే' అని వెల్ల‌డించింది.ఇక మీకు ఇష్ట‌మైన హీరో ఎవ‌రంటే చిరంజీవి గారు అని ట‌క్కున చెప్పేసింది. ఎందుకంటే ఎక్క‌డికి వెళ్లినా.. ఎవ‌రిని అడిగినా చాలా మంది చిరంజీవిగారే మాకు స్ఫూర్తి అని చెబుతుంటారు. ఆయ‌నొక లెజెండ్.. అందుకే ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌నే నా ఫేవ‌రేట్ హీరో. అని చెప్పేసింది. అనుప‌మ‌.

ఇదే సంద‌ర్భంగా ఓ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. శర్వానంద్ తో న‌టించిన 'శ‌త‌మానం భ‌వ‌తి' 2017 జ‌న‌వ‌రి 14న సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైంది. దీనికి మూడు రోజులు ముందు అంటే జ‌న‌వ‌రి 11న చిరు సినిమా 'ఖైదీనంబ‌ర్ 150' విడుద‌లైంది. 'శ‌త‌మానం భ‌వ‌తి' రిలీజ్ రోజు శ‌ర్వానంద్ తో క‌లిసి అనుప‌మ.. చిరు సినిమా 'ఖైదీనంబ‌ర్ 150'ని థియేట‌ర్లో చూసింద‌ట‌. ఇదే త‌ను చూసిన చిరు ఫ‌స్ట్ ఫిల్మ్ అని చెప్పి షాకిచ్చింది.