Begin typing your search above and press return to search.

అనుపమా పరమేశ్వరన్ జోరు తగ్గిందా?

By:  Tupaki Desk   |   26 April 2021 10:00 PM IST
అనుపమా పరమేశ్వరన్ జోరు తగ్గిందా?
X
తెలుగు తెరకి పరిచయమైన కుర్ర కథనాయికలలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. విశాలమైన కళ్లతో ఈ అమ్మాయి చేసే విన్యాసాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కనురెప్పలతో ఆమె వేసే కోలాటంలో తమ చూపులను జత చేశారు. 'అ ఆ' సినిమాలో తెరపై చేపపిల్లలా జారిపోయే ఈ అమ్మాయిని చూసి మురిసిపోయారు. ఆమె అభిమానులుగా పడిఉండటమే అదృష్టమని ఫిక్స్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె సినిమాలను పొలోమంటూ ఫాలో అవుతున్నారు. ఆమె కోసం థియేటర్ల చుట్టూ చేరుతున్నారు.

'ప్రేమమ్' సినిమా వచ్చాక అమ్మాయి ఆభిమానుల సంఖ్య అమాంతంగా పెరిగింది. 'కృష్ణార్జున యుద్ధం' తరువాత ఇలాంటి పిల్ల కోసం డైలీ సీరియల్ మాదిరిగా అప్పుడప్పుడూ బ్రేక్ తీసుకుంటూ ఎంతకాలమైనా యుద్ధం చేయవచ్చనని అనుకున్నారు. తమిళ .. మలయాళ సినిమాల కారణంగా ఈ అమ్మయి ఇక్కడ పూర్తి దృష్టి పెట్టలేకుండా పోతోంది. 'రాక్షసుడు' సినిమా హిట్ అయినా, ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు కారణంగా అది ఆమె ఖాతాలోకి వెళ్లలేదు.

ఇక ప్రస్తుతం ఈ పిల్ల నిఖిల్ జోడీగా '18 పేజెస్' చేస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు. అంటే ఈ అమ్మాయి ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలాకాలం పడుతుంది. ఈ లోగా తెలుగులో ఆమె సినిమా మరొకటి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులలోను ఈ అమ్మడి పేరు వినిపించడం లేదు. చూస్తుంటే ఈ పిల్ల జోరు తగ్గినట్టుగానే కనిపిస్తోంది. కొత్త హీరోయిన్ల తాకిడే అందుకు కారణమని అనుకోవాలేమో.