Begin typing your search above and press return to search.

నా కన్నా సమంతనే బెస్ట్ -అనుపమ

By:  Tupaki Desk   |   2 July 2018 4:05 AM GMT
నా కన్నా సమంతనే బెస్ట్ -అనుపమ
X
మళయాళ సూపర్ హిట్ ప్రేమమ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. చూడచక్కని అందాల సుందరి కావడంతో టాలీవుడ్ ఆమెకు వెల్ కం చెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్ డిమాండ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో అనుపమ పేరు ముందే ఉంటుంది. వరసగా రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులను తన అందాల మాయలో పడేస్తూ వస్తోంది.

అనుపమ కెరీర్ లో లోటు ఏదన్నా ఉందంటే ఇంకా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ ఆమెకు రాలేదు. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో నటించే అవకాశం ముందు అనుపమనే వరించింది. కానీ తరవాత అనుకోని పరిస్థితుల్లో ఆ ఛాన్స్ సమంతను వరించింది. కానీ రామలక్ష్మి పాత్రలో సమంత చాలా బాగా నటించిందని .. ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదని అనుపమ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇదే విషయం డైరెక్టర్ సుకుమార్ కు తానే స్వయంగా చెప్పానంటూ ఈ సుందరి చెప్పుకొచ్చింది.

తనకు మిస్సయిన గోల్డెన్ ఛాన్స్ వేరొక హీరోయిన్ కు దక్కిందంటే ఆ విషయం ఎత్తడానికి కూడా మిగతా హీరోయిన్లు ఇష్టపడరు. కానీ అనుపమ మాత్రం దానిని చాలా స్పోర్టివ్ గా తీసుకోవడమే కాదు.. అవతల హీరోయిన్ ను మెచ్చుకోవడాన్ని టాలీవుడ్ లో పలువురిని ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం అనుపమ మెగా ఫ్యామిలీలోని సాయి ధరమ్ తో చేసిన‘ తేజ్.. ఐవ్ యూ’ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టు కరుణాకరన్ ఈ మూవీకి దర్శకుడు