Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూజివ్.. అనుపమ పరమేశ్వరన్ తో తుపాకీ డాట్ కామ్ స్పెషల్ చిట్ చాట్
By: Tupaki Desk | 25 July 2019 9:48 AM GMT* టాలీవుడ్ లో ముందున్నంత క్రేజ్ ఇప్పుడు లేదనిపిస్తోంది - సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు ఎందుకని..
ఇక్కడ టాలెంట్ స్పీక్స్ అండీ - ఇక్కడే కాదు ఎక్కడైనా ప్రతిభ ఉన్నవారే రాణిస్తారు. నా యాక్షన్ టాలెంట్ - నా లుక్స్ నచ్చి తెలుగు అభిమానులు నన్ను ఆదరించారు. వారి అభిమానాన్ని మరింతగా పెంచుకోవడానికే నాకొచ్చే కథల పట్ల సెలెక్టీవ్ గా ఉంటున్నా. ఈ కారణంగానే కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాను. దీని వల్ల ఆడియెన్స్ కి కాస్త దూరం అవుతున్నాననే అనిపిస్తోంది. కానీ మనసుకు నచ్చని క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసి ఇబ్బంది పడలేను కదా.. నిజానికి ఫ్రొఫెషనల్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నా..
* స్క్రిప్ట్స్ పట్ల సెలెక్టీవ్ గా ఉంటున్నారు సరే - ఎందుకని టిపికల్ - సీరియస్ క్యారెక్టర్స్ పోషిస్తున్నారు..
అవును కదా(నవ్వులు) నిజంగా నేను నాకు తెలియకుండానే టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఏం చేస్తాం చెప్పండి అన్ని అవే వస్తున్నాయి. అలా వచ్చిన రోల్స్ అన్ని నాకు నచ్చేస్తున్నాయి. నిన్నుకోరి తమిళ రీమేక్ తరువాత మళ్లీ ప్రేమమ్ లో చేసినట్లుగా ఓ బబ్లీ క్యారెక్టర్ చేయలనిపిస్తోంది. లెట్స్ సీ..
* సినిమాల్లోకి వచ్చాక పేరుతో పాటు రూమర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి - ఓ క్రికెటర్ తో రిలేషన్ లో ఉన్నారనే గాసిప్స్ పై కామెంట్
(కొద్ది సేపు మౌనం... మళ్లీ నవ్వుతూ) నో కామెంట్స్ - దీని పై నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను.
* పోని కే ఎల్ రాహుల్ లేక బుమ్రా వీరిద్దరితో రిలేషన్ లో ఉన్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎవరో క్లారిటీ ఇవ్వండి..
(నవ్వుతూ.. కొంత సీరియస్ గా) నో కామెంట్స్ అని చెప్పాను కదా అండి - వేరే టాపిక్ గా వెళ్దాం ప్లీజ్
* కెరీర్ లో తొలిసారిగా ఓ టీచర్ పాత్రలో కనిపించబోతున్నారు - రాక్షసుడు మీ రోల్ ఎలా ఉండబోతుంది..
రాక్షసన్ తమిళ్ రీమేక్ గా రాక్షసుడు వస్తోంది. ఈ సినిమాలో ఓ టిపికల్ క్యారెక్టర్(కొంత సేపు ఆగి అదే మీరు అడినట్లుగానే.. నవ్వులు) చేస్తున్నాను. టీచర్ గా నటించాలంటే - కొంత అలోచించాను - అలాంటి రోల్ కి నేను సెట్ అవుతానా లేనా అని చాలా డైలమా తరువాత ఈ క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకున్నా - సెట్స్ లోకి వచ్చాక కూడా ఇలాంటి మెచ్చ్యూర్డ్ క్యారెక్టర్ లో నేను ఎలా నటిస్తున్నాను అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని..
* మళయాలం - తమిళం - తెలుగు ఈ మూడు ఇండస్ట్రీల్లో మీరు ఏ భాషలో యాక్ట్ చేయడానికి ఎక్కువ కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు..
తెలుగులో ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నా కాబట్టి టాలీవుడ్ కే నేను ఎక్కువ టైమ్ కేటాయించాలి. ఇక్కడ భాష వల్ల కూడా నాకు పెద్దగా ఇబ్బందేమి లేదు.. మళయాలం నా మాతృభాష కాబట్టి అక్కడ ఇంకా పేరు తెచ్చుకోవాలనే ఆశ ఉంది. తమిళంలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నా - ఇంకా అక్కడ పరిస్థితుల్ని ఎనలైజ్ చేసే పరిస్థితిలో నేను లేను. సూటిగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలోనే నటించడానికి నేను ఎక్కువ కంఫర్ట్ గా ఫీల్ అవుతాను..
* ఇప్పుడు తెలుగు సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి తెలుగుకి ఓటు వేస్తున్నారా ఏంటి..
(నవ్వులు) అదేం లేదండి - నిజంగా తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం..
* మీకు ఈ సినిమాతో సక్సెస్ రావాలని - మీరు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని మా తుపాకీ డాట్ కామ్ కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్..
వెరీ నైస్ స్పీకింగ్ విత్ యూ అండీ - ధ్యాంక్యూ - తుపాకీ డాట్ కామ్ రీడర్స్ అంతా మా రాక్షసుడు సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను
ధ్యాంక్యూ