Begin typing your search above and press return to search.

అనుపమకూ ఆ బాధలు తప్పలే

By:  Tupaki Desk   |   28 Oct 2017 7:03 PM IST
అనుపమకూ ఆ బాధలు తప్పలే
X
టాలీవుడ్ లో అనుపమా పరమేశ్వరన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇటు అందంతో పాటు అటు ట్యాలెంట్ కూడా పుష్కలంగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ చిత్రానికి ప్రమోషన్స్ చేస్తోంది.

ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు గాను స్పందిస్తూ.. అమ్మాయిలకు ఎదురయ్యే కష్టాలపై రియాక్ట్ అయింది. తను ఇప్పుడు హీరోయిన్ అయ్యాక సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా.. గతంలో ఇలాంటి ఇబ్బందులు చాలానే ఎదుర్కున్నానని చెబుతోంది అనుపమ. కుర్రాళ్ల నుంచి.. కొన్ని సార్లు లెక్చరర్ల నుంచి కూడా వెకిలి మాటలు వినాల్సి వచ్చేదని చెబుతోంది అనుపమ. ఇక లైంగిక వేధింపులు కూడా అమ్మాయిలకు తప్పడం లేదని.. తాను కూడా చదువుకునే రోజుల్లో హాస్టల్ నుంచి కాలేజ్ కు బస్సులో వెళ్లేటపుడు చాలానే ఇబ్బంది పడ్డానని అంటోంది ఈ మలయాళీ భామ.

దగ్గరగా నుంచోవడం.. అసభ్యంగా తాకడం వంటివి చేసేవారని.. కొన్ని సార్లు కండక్టర్లు కూడా ఇలాంటివాటికి పాల్పడేవారని చెబుతున్న ఈమె.. అసలు ఇలాంటి చర్యల కారణంగా వాళ్లు ఏం పొందుతారో అర్ధం కాదని అంటోంది. అమ్మాయిలను ఇలాంటి వెకిలిమాటలతో.. చేష్టలతో ఇబ్బందిపెట్టేవారు.. తమ తల్లి.. సోదరిలను గుర్తు చేసుకోవాలని సున్నితంగానే గడ్డి పెట్టేస్తోంది అనుపమా పరమేశ్వరన్.