Begin typing your search above and press return to search.

హలో గురూ.. అనుపమ పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   8 Oct 2018 11:46 AM IST
హలో గురూ.. అనుపమ పరిస్థితి ఏంటీ?
X
మలయాళ ప్రేమమ్‌ తో గుర్తింపు దక్కించుకుని తెలుగులో ‘ప్రేమమ్‌’, ‘అఆ’ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్‌ మొదట సక్సెస్‌ లను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈమెకు ‘శతమానంభవతి’ భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత చేసిన చిత్రాలు ఈమెకు వరుసగా ఫ్లాప్‌ లనే తెచ్చి పెట్టాయి. అనుపమ పరమేశ్వరన్‌ ‘ఉన్నది ఒక్కటి జిందగీ’ - ‘తేజ్‌ ఐలవ్యూ’ - ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రాలతో నిరాశ పర్చింది. ఆ చిత్రాల తర్వాత అనుపమ తాజాగా రామ్‌తో ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలో నటించింది. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంపై రామ్‌ మరియు దిల్‌ రాజులు చాలా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో హీరోయిన్‌ అనుపమకు కూడా ఈ చిత్రం సక్సెస్‌ చాలా కీలకం.

స్టార్‌ డం పొందని హీరోయిన్‌ వరుసగా మూడు నాలుగు ఫ్లాప్‌ లు చవిచూస్తే ఆమె కెరీర్‌ దాదాపుగా ముగిసినట్లే అంటారు. అందుకే ఈ చిత్రం సక్సెస్‌ అయితేనే అనుపమ పరమేశ్వరన్‌ కు తర్వాత ఛాన్స్‌ లు దక్కుతాయి. ఒకవేళ సినిమా ఫలితం తారు మారు అయితే మాత్రం అనుపమకు స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ లు పక్కన పెడితే అసలు ఛాన్స్‌ లే రావడం కష్టం అంటున్నారు. అందుకే ఈ చిత్రం కోసం ఆమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ తో అనుపమ ఆకట్టుకుంది. మరి సినిమాలో ఏ రేంజ్‌ లో ఈ అమ్మడు మెప్పిస్తుందో చూడాలి. గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో అనుపమ కాస్త గ్లామర్‌ గా కనిపించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.