Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఫుల్ ట్రెడిషనల్.. ఓనం స్పెషల్

By:  Tupaki Desk   |   12 Sep 2019 8:21 AM GMT
ఫోటో స్టొరీ: ఫుల్ ట్రెడిషనల్.. ఓనం స్పెషల్
X
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'అ ఆ'.. 'శతమానం భవతి' హిట్లతో హ్యాట్రిక్ సాధించింది. కానీ అప్పటి నుంచి అనుపమ నటించిన సినిమాలు వరసగా నిరాశపరిచాయి. అయితే రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన 'రాక్షసుడు' విజయం అనుపమకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

ఆ సంగతి పక్కన పెడితే ఈరోజు ఓనం పండుగ. కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే ఫెస్టివల్. ట్రెడిషనల్ హాఫ్ వైట్ కలర్ చీరలు ధరించి అమ్మాయిలు చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అనుపమా కూడా మలయాళి అమ్మాయే కదా. అందుకే అందరికీ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓనం శుభాకాంక్షలు తెలిపింది. కేరళ ట్రేడ్ మార్క్ కలర్ చీర ధరించి సూపర్ గా రెడీ అయింది. ఆ ఫోటోలను షేర్ చేసింది. క్రీమ్ కలర్ చీర.. బ్లూ కలర్ బ్లౌజ్ లో పాలకోవాలాగా కనిపిస్తోంది. రింగుల జుత్తు కూడా భలే ఉంది. ముక్కు పుడక.. వేలాడే ఇయర్ రింగ్స్ ధరించి పర్ఫెక్ట్ లోకల్ బ్యూటీ లాగా పోజులిచ్చింది. ఆ స్మైల్ కూడా సూపరే.

ఈ ఫోటోకు స్పందనగా నెటిజన్లు చాలామంది అనుపమకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కొందరు ఇతర నెటిజన్లు భలే భలే కామెంట్లు పెట్టారు. "అలా చూడొద్దు అనూ".. "వా...ఆఆఆఆఆఆవ్".. "నీలో ఏదో స్పెషల్ ఉంది" అంటూ పొగడ్తలు కురిపించారు. అనుపమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించే మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.