Begin typing your search above and press return to search.

అందమంతా కళ్లలోనే ఉంటుంది

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:29 AM GMT
అందమంతా కళ్లలోనే ఉంటుంది
X
మళయాళ ప్రేమమ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి కేరళలో అందరి గుండెలను కొల్లగొట్టేసింది యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ‘అ..ఆ’ సినిమాతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసి ఇక్కడ అందరి ప్రశంసలు దక్కించుకుంది. శతమానం భవతి సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయి అంటే ఇలాగే ఉంటుంది అనిపించేంత అందంగా కనిపించింది. ఈ మూవీ బంపర్ హిట్ అయినా ఎందుకో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

గ్లామర్ హీరోయిన్ గా క్లిక్ అవడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న అనుపమ అందం గురించి తనదైన డెఫినిషన్ ఇస్తోంది. ‘‘ఒళ్లంతా కనిపించేలా.. ఒంపుసొంపులన్నీ ఆరబోసేలా కనిపిస్తేనే అందంగా ఉన్నట్టు కాదు. ఓ అమ్మాయి చీర కట్టుకున్నా... చుడీదార్ వేసుకున్నా.. లంగా ఓణీలో అయినా గ్లామరస్ గానే కనిపించొచ్చు. ఫైనల్ గా అందమనేది చూసే కళ్లపైనే ఆధారపడి ఉంటుంది తప్ప డ్రస్సింగ్ మీద కాదు’’ అనేది అనుపమ క్లారిటీ ఇచ్చింది. తెలుగులో మరో రెండు సినిమాలు చేయబోతున్నాను అని చెబుతున్న అనుపమ తెలుగు భాషలో మరింత పట్టు సాధిస్తానని నమ్మకంగా చెబుతోంది. శతమానం భవతిలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంది. ఇప్పటివరకు తెలుగులో పనిచేసిన డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సతీష్ వేగేశ్నల దగ్దర ఎంతో నేర్చుకున్నానని.. వాళ్లిద్దరి సినిమాల్లో నటించడం అదృష్టమని అంటోంది.

శతమానం భవతి తర్వాత ఎన్టీఆర్ - రామ్ చరణ్ తేజ్ లాంటి స్టార్ల పక్కన కనిపించే అవకాశం వచ్చినట్టే వచ్చి ఆమె చెయ్యి జారిపోయాయి. ‘‘ఆ సినిమాలు ఎందుకు చెయ్యలేకపోయానో నేను కారణాలు బయటపెట్టలేను. బహుశా విధి అలా రాసిపెట్టి ఉండొచ్చు. లేదా ఆ అవకాశం మరోసారి రావచ్చు’’ అని ఒకరకమైన వేదాంతం వల్లిస్తూ చెబుతోంది అనుపమ.