Begin typing your search above and press return to search.

నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని

By:  Tupaki Desk   |   18 Oct 2017 6:30 AM GMT
నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని
X
టాలీవుడ్ లో ప్రస్తుతం లేటెస్ట్ హీరోయిన్స్ హవా బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా మలయాళీ ముద్దుగుమ్మలు వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ తీసింది ముడు సినిమాలే అయినా అందరిని తెగ ఆకట్టుకుంటోంది. గ్లామర్ షోలకు ఎక్కువగా తావివ్వకుండా సింపుల్ గా హోమ్లీగా కనిపిస్తూనే ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

మొదట అ ఆ సినిమా తర్వాత అమ్మడు చాలా ఫేమస్ అయ్యింది. ఎక్కడికి వెళ్లినా అందులో చేసిన నాగవల్లి పాత్రను గుర్తు చేస్తున్నారని అంటోంది. అంతే కాకుండా తను కథను మాత్రమే నమ్ముతానని కథనే అసలు హీరో కథ బావుండి తన క్యారెక్టర్ కూడా బావుంటే సినిమాను చేస్తాను అంటోంది. శతమానం భవతి లో కూడా అమ్మడికి మంచి మార్కులే పడ్డాయి. దీంతో మెయిన్ లీడ్ లో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే సినిమా అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నిటినీ ఒకే చేయను అంటోంది అనుపమ. ఎందుకంటే.. బిజీ బిజీ షెడ్యూల్ లో ఉండడం నాకు ఇష్టం ఉండదు ఒక క్యారెక్టర్ చేస్తున్నపుడు మరొక సినిమాలో మరొక క్యారెక్టర్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని ఫ్యామిలీ తో కూడా ఉండాలని అనుకుంటా.. ఇక ప్రేక్షకులు కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. టాలీవుడ్ నాకు సెకండ్ హోమ్ అని ఫిక్స్ అయ్యాను. మంచి క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. సో చేసిన ప్రతి సినిమా అందరికి నచ్చాలి అనేదే నా ఆలోచన. ఉన్నది ఒకటే జిందగి సినిమాలో కూడా మహాలక్ష్మి అనే మంచి పాత్రను చేశాను. ఆ క్యారెక్టర్ అందరికి నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది. సినిమా కూడా చాలా బావుంటుందని అనుపమ వివరించింది.

అలాగే అప్పటివరకు నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా దర్శకులు కూడా అందుకు ఒకే అనేస్తున్నారని చెప్పింది. ఇక ఇతర హీరోయిన్స్ కూడా నాకు చాలా ఇష్టం. నాకు వారు చేసిన పాత్రలు నచ్చితే వెంటనే కాల్ చేస్తాను. వారు కూడా నాతో చాలా ఫ్రెండ్లి గా ఉంటారు నా సినిమాలు నచ్చినప్పుడు చాలా బావుందని కామెంట్స్ చేస్తారని తెలిపింది.