Begin typing your search above and press return to search.

అయ్యో పాపం.. బరువు పెరిగిందట

By:  Tupaki Desk   |   9 April 2018 11:30 PM GMT
అయ్యో పాపం.. బరువు పెరిగిందట
X
ఇండస్ట్రీలో కొంతమంది బొద్దు అందాలు ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం కొంచెం నాజూకుగా ఉండే హీరోయిన్లకు ఎక్కువ వస్తాయి అని చెప్పచ్చు. అందుకే చాలా వరకు హీరోయిన్లు జిమ్ ల చుట్టూ తిరుగుతూ కొవ్వును కరిగిస్తూ బరువును తగ్గిస్తూ ఉంటారు. ఏమాత్రం బరువు పెరిగినా గుండె ఆగిపోయినంత హడావిడి చేస్తారు. అలాంటి భామల్లో అనుపమ పరమేశ్వరన్ కూడా చేరిపోతోంది ఇప్పుడు.

మలయాళం లో ప్రేమమ్ సినిమా తో పాపులారిటీ సంపాదించిన ఈ భామ తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్ లో అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. అప్పటినుండి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గతేడాది శతమానం భవతి తో బ్లాక్ బస్టర్ నమోదు చేసుకున్న అనుపమ ఉన్నది ఒకటే జిందగి తో పర్లేదు అనిపించుకుంది. ఈ ఏడాది నాచురల్ స్టార్ నానితో నటించిన కృష్ణార్జున యుద్ధం విడుదల కాబోతోంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నానితో నటించడం ఆనందంగానే ఉన్నప్పటికీ కొంచెం బరువు పెరిగిందంట.

ప్రి రిలీజ్ ఈవెంట్ బాగానే కనిపించింది కానీ అనుపమ మాత్రం తెగ గాబరా పడుతోంది. అందుకే వెంటనే జిమ్ కి వెళ్లి వర్కౌట్లు చేయాల్సిందే అని ఫిక్స్ అయింది. అలాగే ఒక ప్రక్కన సాయిధరమ్ అండ్ కరుణాకరున్ సినిమాలో.. మరో ప్రక్కన త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న 'హలో గురూ ప్రేమ కోసమేరా' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె చీరలో వేసిన స్టెప్పుల ప్రోమో వీడియో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.