Begin typing your search above and press return to search.
ప్రేమే బలం అంటున్న మల్లూ బ్యూటి
By: Tupaki Desk | 28 Jan 2017 5:08 AM GMTటాలీవుడ్ లో అరంగేట్రం నుంచి వరుసగా మూడు సినిమాలు చేసి.. అన్నిటితోనూ హిట్స్ సాధించేసింది మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. రీసెంట్ గా జరిగిన శతమానం భవతి సక్సెస్ మీట్ లో.. తెలుగులో మాట్లాడేసి అందరినీ ఆకట్టుకుంది. 'నా లైఫ్ లో మర్చిపోలేని.. చాలా ప్రత్యేకమైన రోజు. మీ అందరికీ కారణం తెలుసు. చిరంజీవి గారిని గతంలో నేనెప్పుడూ కలవలేదు. మొదటిసారిగా ఆయన్ని కలిశాను. ఆయన నుంచి ఆశీర్వాదాలు అందుకోవడం చాలా ప్రత్యేకం. థ్యాంక్యూ సోమచ్ చిరంజీవి గారూ' అనేంతవరకూ తెలుగు-ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడిన అనుపమ.. ఆ తర్వాత తెలుగు మాటలతో రెచ్చిపోయింది.
'శతమానం భవతి నాకు ఒక సినిమా కాదు.. ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి అనుభవం. నన్ను ఎంకరేజ్ చేసి.. ఈ సినిమా హిట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా మొత్తం టీం పెద్ద కంగ్రాట్స్. నిత్యా లాంటి ఇంత అభిమానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నచ్చని వాళ్లకు కూడా ఈ సారి బాగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. దర్శకుడు.. నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్. నన్ను ఎంతో అందంగా చూపించిన సమీర్ గారికి కూడా థ్యాంక్స్' అని చెప్పింది అనుపమా పరమేశ్వరన్.
'ప్రకాష్ రాజ్.. జయసుధ.. ఇంద్రజ.. ఇలా కలిసి పని చేసిన టీం మొత్తానికి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ ప్రేమే నాకు బలం' అంటూ చివర్లో సొంతగా ఓ స్ట్రాంగ్ డైలాగ్ కూడా చెప్పేయడం చూస్తే.. అమ్మడు ఏ రేంజ్ లో తెలుగు నేర్చేసుకుందో అర్ధమవుతుంది. మూడు సినిమాలకే ఇంత స్పష్టమైన స్వచ్ఛమైన తెలుగు అంటే.. ఇంకో మూడు సినిమాలు చేసేసరికి.. ఇక అనుపమ ఏ రేంజ్ లో తెలుగు కుమ్మేస్తుందో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/