Begin typing your search above and press return to search.
చదువు మానేస్తున్న చైతూ హీరోయిన్
By: Tupaki Desk | 8 Feb 2016 11:00 AM ISTఇప్పటివరకు కేవలం హీరయిన్లు అంటే గ్లామర్ అన్నట్లుగానే ఉండేది. కాని ఇప్పటి తరం భామలు మాత్రం చదువును కూడా టైముకు ఫినిష్ చేస్తున్నారు. దాని వలన ఏమవుతుందంటే.. ఒకవేళ హీరోయిన్ గా టైమ్ చెల్లిపోయినా కూడా.. వేరే ఏదైనా బిజినెస్ లేదా జాబ్ కు హెల్ప్ అవుతుంది. మన స్టార్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్ - దీపికా పదుకొనె - తమన్నా లు ఇంటర్ తోనే ఆపేసినా.. తాప్సీ - కృతి సేనన్ వంటి భామలు ఇంజనీరింగ్ చేసి మరీ రంగంలోకి దిగారులే.
కట్ చేస్తే.. ఇప్పుడు మన మాట్లాడుతోంది మజ్నూ సినిమాలో నాగ చైతన్య హీరోయిన్ గా చేస్తున్న మల్లూ భామ అనుపమ పరమేశ్వరన్ గురించే. అమ్మడు వయస్సు 19 ఏళ్ళు. బిఏ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చదువుతోంది. అయితే తెలుగులో చైతూ పిలిచి ఆఫర్ ఇచ్చాడో లేదో.. వెంటనే మజ్నూతో పాటు ''అ..ఆ..'' ''ఎవడో ఒకడు'' వంటి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ షూటింగ్ కారణంగా కాలేజీకి వెళ్ళడం అనే కాన్సెప్టు కష్టమవుతోందట.
''నాకు అర్ధమైపోయింది. తెలుగు సినిమాల కారణంగా నేను కాలేజీకి వెళ్లడం కుదరదు. పైగా ఖాళీ సమయాల్లో తెలుగు కూడా నేర్చుకోవాలి కదా. అందుకే వచ్చే సంవత్సరం నా బిఏ డిగ్రీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఏడాదికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా'' అంటూ ప్రకటించిందీ భామ. ఒకవేళ ఇక్కడి క్లిక్ అయి్య స్టార్ హీరోయిన్ అయితే.. ఇక ఆ డిగ్రీ అటకెక్కేసినట్లేగా!!