Begin typing your search above and press return to search.
ముద్దుగుమ్మ తూగో యాసలో అదరగొట్టేసిందిగా..
By: Tupaki Desk | 30 Oct 2017 8:11 AM GMTప్రేమమ్ సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని... తెలుగులోనూ వరుస హిట్లతో యూత్ మనసు కొల్లగొట్టేసిన మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అచ్చ తెలుగు అమ్మాయిగా మారిపోతోంది. అచ్చ తెలుగు అమ్మాయంటే సినిమా కోసం లంగావోణీ వేసుకోవడం కాదు - ‘ఆయ్’ అంటూ మన గోదారి యాసలో ఇరగదీసేస్తోంది కూడా. అవును... ఒక న్యూస్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ గోదారి యాసలో మాట్లాడింది. అనుపమ కంటే ముందే తెలుగు ఇండస్ర్టీకి వచ్చిన మిగతా పరభాషా హీరోయిన్లంతా తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతుంటే ఈ అమ్మడు మాత్రం ఇక్కడి ప్రాంతీయ యాసలను కూడా పట్టేసుకోవడం చిన్న విషయమేమీ కాదు.
తాను గోదావరి యాస అంత ఈజీగా మాట్లాడడానికి కారణం ఉందని, ఆ యాస తనకు బాగా నచ్చిందని ఆమె అంటున్నారు. అంతేకాదు... అచ్చం తన సొంత రాష్ర్టం కేరళలా కనుచూపు మేరలో కొబ్బరి చెట్లతో ఉన్న కోనసీమ తనకు ఎంతో నచ్చిందని అనుపమ చెప్పింది. శతమానం భవతి సినిమా టైంలో సుమారు 50 రోజులు కోనసీమలో ఉన్నానని... అప్పుడు పరాయి రాష్ర్టంలో ఉన్న ఫీలింగ్ లేకుండా సొంత రాష్ర్టం కేరళలో ఉన్నట్లే అనిపించిందని అనుపమ చెప్పుకొచ్చింది.
గోదావరి యాసే కాకుండా అక్కడి భోజనమూ అనుపమకు తెగ నచ్చేసిందట. పెసరట్టు - ఉప్మా - పునుగులు.. ఇలా గోదావరి జిల్లాల్లో దొరికే చాలా పదార్థాలు బాగా నచ్చాయట. అక్కడి యాస, కొత్త వాళ్లని ఆదరించే తీరుకు ఫిదా అయిపోయానంటోందీ భామ. అలాగే హైదరాబాద్‌లో గోల్కొండ - బిర్లా మందిర్ - చార్మినార్ లాంటి ప్రాంతాలు కూడా బాగా నచ్చాయట.
అనుపమ గోదావరి యాస వినాలంటే ఈ లింకు క్లిక్ చేయండి.