Begin typing your search above and press return to search.

అనుపమ పెద్ద గోల్‌ పెట్టుకుందిగా..!

By:  Tupaki Desk   |   11 Nov 2018 7:40 AM GMT
అనుపమ పెద్ద గోల్‌ పెట్టుకుందిగా..!
X
హీరోలు - నటులు దర్శకులుగా మారడం - హీరోయిన్స్‌ దర్శకత్వం చేయడం అనేది తెలుగు సినిమా పరిశ్రమలో - ఇతర పరిశ్రమల్లో కొత్తేం కాదు. ఎంతో మంది హీరోయిన్స్‌ దర్శకత్వం వైపు అడుగులు వేశారు. అందులో కొందరు సక్సెస్‌ అవ్వగా కొందరు మాత్రం నిరాశ పర్చారు. దర్శకత్వంపై మోజు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక సినిమా బాధ్యత మొత్తం దర్శకుడిపై ఉంటుంది. దర్శకుడు చెప్పినట్లుగా కొన్ని వందల మంది వినాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా దర్శకత్వం చేయాలనే కోరుకుంటారు. కాని ఎక్కువ శాతం మంది దర్శకత్వం చేసే అవకాశం రాకపోవడం లేదా మరే ఇతర కారణం వల్ల దర్శకత్వం వరకు రాలేరు.

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాత్రం దర్శకురాలిగా మారాలనే గట్టి పట్టుదలతో ఉంది. ప్రేమమ్‌ చిత్రంతో అందరి దృష్టిని అలరించి, తెలుగులో ఈమద్య వరుసగా చిత్రాల్లో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన దర్శకత్వ కోరికను - ప్లానింగ్స్‌ ను షేర్‌ చేసుకుంది. మణిరత్నం గారి దర్శకత్వం నాకు చాలా ఇష్టం. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్‌ కూడా అద్బుతంగా ఉంటుంది. ఆయనలా కనీసం ఒక్క ఫ్రేమ్‌ అయినా పెట్టాలి అనేది నా కోరిక అంది.

ఇంకా అను మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు నటించిన సినిమాల దర్శకులందరిని కూడా సహాయ దర్శకురాలిగా ఛాన్స్‌ ఇవ్వాలని కోరాను. త్రివిక్రమ్‌ గారితో పాటు అంతా కూడా తప్పకుండా అంటూ హామీ ఇచ్చారు. మొదట సహాయ దర్శకురాలిగా చేసి - నా వద్ద ఉన్న కొన్ని కాన్సెప్ట్‌ ను కథలుగా మార్చి దర్శకురాలిగా మారుతాను అంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ గా అవకాశాలు సన్నగిల్లినప్పుడు ఈమె దర్శకత్వం వైపు అడుగులు వేసే అవకాశం ఉందనిపిస్తుంది. మరి అనుపమ కోరుకుంటున్నట్లుగా ఒక మంచి దర్శకురాలిగా పేరు తెచ్చుకుంటుందా చూడాలి.