Begin typing your search above and press return to search.

అమ్మ‌డి మాట వింటే చిరు ఫిదానే!

By:  Tupaki Desk   |   17 Jun 2018 5:03 AM GMT
అమ్మ‌డి మాట వింటే చిరు ఫిదానే!
X
చూసినంత‌నే మ‌ళ్లీ.. మ‌ళ్లీ చూడాల‌నిపించే అందం అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర్‌. వాలు చూపుల‌తో యూత్‌ను లాక్ చేసేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పింది. ప్ర‌స్తుతం తెలుగులో రామ్ స‌ర‌స‌న హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రంలో చేస్తున్న ఆమె.. త‌మిళ‌.. మ‌ల‌యాళ మూవీస్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

బెజ‌వాడ‌కు వ‌చ్చిన అనుప‌మా త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. తాను మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిన‌ని.. ఆయ‌న గొప్ప న‌టుడ‌న్నారు. చిరుతో న‌టించేందుకు అర నిమిషం అవ‌కాశం వ‌చ్చినా త‌న జ‌న్మ ధ‌న్య‌మైన‌ట్లుగా భావిస్తాన‌ని చెప్పారు. చిరుతో న‌టించాల‌న్న కోరిక‌ను ఓపెన్ చేసేసిన ఈ భామ‌.. నిమిషం కాదు.. అర నిమిషం పాటు చిరుతో స్క్రీన్ ప్రెజెన్స్ కోసం త‌పిస్తున్న అనుప‌మ మాట వింటే మెగాస్టార్ ఫిదా కావ‌టం ప‌క్కా అంటున్నారు.

తాజాగా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ చేసిన వ్యాఖ్య‌లు మెగా హీరోల దృష్టి ప‌డే అవ‌కాశం ఉంద‌ని.. చిరు అంటే అంత ఇష్ట‌మని చెప్పాక ఛాన్స్ రాకుండా ఎందుకు ఉంటుంద‌ని చెబుతున్నారు. చూస్తుంటే.. త్వ‌ర‌లోనే ఆమె కోరిక తీరే అవ‌కాశం ఉంద‌న్న‌ మాటను మెగా క్యాంప్‌కు చెందిన ఒకరి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. తీపిక‌బురు ఎప్పుడు వ‌స్తుందో?