Begin typing your search above and press return to search.

మరో నిత్యా మీనన్‌ అవుతుందేమో

By:  Tupaki Desk   |   1 Jun 2016 1:42 PM IST
మరో నిత్యా మీనన్‌ అవుతుందేమో
X
''రావాణాసురుడి భార్య కూడా.. వాళ్ళాయన్ను పవన్‌ కళ్యాణ్‌ అనే అనుకుంటుంది'' అంటూ ''అ..ఆ'' సినిమా ట్రైలర్‌ లో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ చెబుతున్న డైలాగ్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. ఈ మలయాళీ బ్యూటి చూడ్డానికి సూపర్ గార్జియస్‌ గా ఉంది సరే.. ఇంతకీ ఈ డబ్బింగ్‌ చెప్పింది ఎవరో తెలుసా?

అబ్బే ఎవరో కాదు.. డైరెక్టుగా ఆ అమ్మడే డబ్బింగ్‌ చెప్పేసుకుంది. గడుచు వాయిస్‌ తో జీరగా అనిపించే మాడ్యులేషన్‌ తో.. డైరెక్టుగా అనుపమ తెలుగులో త్రివిక్రమ్ చెప్పింది బట్టీ పట్టి మరీ డబ్బింగ్‌ చెప్పేసిందట. ఇప్పటివరకు మనకున్న మలయాళం హీరోయిన్లలో కేవలం నిత్యామీనన్ ఒక్కమ్మాయే తన డెబ్యూ సినిమాలోనే డబ్బింగ్ చెప్పేసుకుంది. అలా మొదలైంది సినిమాలో ఓన్ వాయిస్ తో ఇరగదీసింది. ఇప్పుడిక అనుపమ పరమేశ్వరన్‌ మరో నిత్యా మీనన్‌ లా తయారైంది మరి.

చూద్దాం ఆడియన్స్ కు ఈమె యాక్టింగ్‌ మరియు డబ్బింగ్‌ ఎంతవరకు నచ్చుతాయో. రేపే అ..ఆ రిలీజవుతోంది.