Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరి: ప్రేమమ్ పోరి భలే భలే
By: Tupaki Desk | 6 Jan 2016 3:51 PM GMTనితిన్ తో కలిసి అఆ అంటూ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకొంటోంది కేరళ కుట్టి అనుపమ. మరి తెలుగు ఏమాత్రం ఒంటబడుతోందో ఏంటో తెలియదు కానీ... ఆమెలో తెలుగుదనం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. లంగాఓణీ కట్టించి, తల్లో మల్లెపూలు పెట్టేసరికి ఇదిగో ఇలా పదహారణాల తెలుగమ్మాయిగా మారిపోయింది. ఇక్కడ చూడండి... ఎంత ముద్దొస్తోందో! తెలుగుదనం మహత్యమే అంత. అన్నట్టు ఈ అవతారం నాగచైతన్య కోసమే. నాగచైతన్యతో కలిసి ప్రేమమ్ రీమేక్ లో నటిస్తోంది అనుపమ. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఒక సన్నివేశం కోసం అనుపమ ఇలా తెలుగమ్మాయిగా మారిపోయింది. ఈ స్టిల్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది. అనుపమ ఇలాంటి రూపురేఖల్లో కనిపించాక ఇక తెలుగు ప్రేక్షకులు ఎలా మరిచిపోతారు చెప్పండి? సో... అనుపమకి మరిన్ని తెలుగు సినిమాలు ఖాయమైపోయినట్టే.