Begin typing your search above and press return to search.
అందాల అనుపమకి ఆ కష్టాలు తప్పలేదట!
By: Tupaki Desk | 20 Feb 2022 9:40 AM GMTఅనుపమ పరమేశ్వరన్ .. అప్పుడే సముద్రం నుంచి తీసిన ముత్యంలా ఉంటుంది .. పాలతో కడిగిన పగడంలా ఉంటుంది .. వెన్నెల్లో విరిసిన కలువలా కనిపిస్తుంది .. వెన్నముద్దకు కనుముక్కు తీరు దిద్దినట్టు అనిపిస్తుంది. గుప్పిట్లో ఇమిడిపోయే గువ్వపిల్లలా కనిపిస్తూనే మనసులన్నిటిపై మంత్రాలు చల్లుతుంది.
కుర్ర హీరోల సరసన కుదురైన రూపంతో ఒదిగిపోతుంది. అనుపమ ఇండస్ట్రీలోకి వచ్చి కొంతకాలమవుతున్నా టీనేజ్ అమ్మాయి మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది .. కోలకళ్లతో కొల్లగొడుతూనే ఉంటుంది.
సాధారణంగా తొలి సినిమా హిట్ కొట్టడమనేది చాలామంది హీరోయిన్స్ విషయంలో జరగదు. హిట్ తో తమ ఎంట్రీ ఉండాలనే వాళ్లంతా కోరుకుంటారు. అలాంటిది అనుపమ వరుసగా 'ప్రేమమ్' .. 'అ ఆ' .. 'శతమానం భవతి' వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది.
పిల్ల చామంతి పువ్వులా ఉందంటూ కుర్రాళ్లంతా కళ్లను కర్పూరాలు చేసి ఆమె చూపుల వాకిట్లో వెలిగించారు. అలా యూత్ లో తనకంటూ మంచి క్రేజ్ ను తెచ్చుకున్న అనుపమ, నాని సరసన నాయికగా 'కృష్ణార్జున యుద్ధం'తో మరిన్ని మార్కులు కొట్టేసింది.
తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ .. సిన్సియర్ గా కెరియర్ పై దృష్టిపెట్టిన అనుపమ కూడా ఒకానొక దశలో హ్యాకర్ల బారిన పడింది. కొంతకాలం క్రితం ఆమె ఫేస్ బుక్ హ్యాక్ చేయబడింది. ఆ తరువాత ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి వదిలారు. తన ఫోటోలను అలా చూసి షాక్ అయిన అనుపమ, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ రూపంలో కూడా కొంతమంది ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అయితే వాళ్లకి ఘాటుగా రిప్లై ఇస్తూ .. వాళ్లు తోకముడిచేలా చేసింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందిపడినట్టుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.
ఇక ఇటీవల వచ్చిన 'రౌడీ బాయ్స్'లో ఆశిష్ జోడీగా ఆమె అలరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఆ తరువాత సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి '18 పేజెస్' రెడీగా ఉంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో ఆమె నిఖిల్ సరసన కనిపించనుంది.
ఆ తరువాత సినిమాగా 'కార్తికేయ 2' రూపొందుతోంది. ఈ సినిమాలోను ఆమె నిఖిల్ సరసన నాయికగా అలరించనుంది. ఈ రెండు సినిమాలపై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుపమకి ఈ సినిమాలు ఎంతవరకూ ఊరటనిస్తాయో చూడాలి మరి.