Begin typing your search above and press return to search.

వాలు చూపుల‌తో వ‌ల‌పు బాణాలు విసురుతోంది!

By:  Tupaki Desk   |   29 March 2023 9:20 AM GMT
వాలు చూపుల‌తో వ‌ల‌పు బాణాలు విసురుతోంది!
X
కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తోంది. వోరగా చూపుల వ‌ల విసురుతూ మ‌తులు చెడ‌గొడుతోంది. అలా అందంగా బ్లాక్ ఇన్న‌ర్ ధ‌రించి ఆ పైన చీర‌లో సింగారం ప‌లికించింది. స్టైలిష్ గా అలా కిల్లింగ్ లుక్స్ తో క‌ట్టి ప‌డేస్తుంటే కుర్ర‌కారు మ‌న‌సు గాడి త‌ప్ప‌కుండా ఉంటుందా? ప‌రి ప‌రి విధాలా త‌ప‌న‌ల‌తో చెల‌రేగుతోంది.

ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అందాల అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ప్రేమ‌మ్ మొద‌లు ఇన్నేళ్ల‌లో కెరీర్ ప‌రంగా ఎదురే లేకుండా హ‌వా సాగిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ త‌న ల‌వ్ లైఫ్ గురించి ఏనాడూ ఓపెన్ కాలేదు.

ఎంపిక చేసుకున్న చీర‌లో ఫ్లోర‌ల్ డిజైన్ క‌ల‌ర్ కి త‌గ్గ‌ట్టే ఆ చెవుల‌కు బ్లూ స్టోన్ క్రిస్ట‌ల్స్ రింగ్ ని ఎంపిక చేసుకుంది. అలా వోర‌గా చూస్తూ వ‌ల‌పు బాణాలు విసురుతున్న అనుప‌మ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

అనుప‌మ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. వీటిలో టిల్లు స్క్వేర్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. బ్లాక్ బ‌స్ట‌ర్ 'డీజే టిల్లు' సీక్వెల్ కి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని ఖరారు చేయ‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెరిగింది.

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి నాడు ప్ర‌క‌టించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'టిల్లు స్క్వేర్' షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాక్సాఫీస్ దగ్గర 'డీజే టిల్లు' సంచలనం సృష్టించిన ఉత్సాహంలో డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ తో ఈ మూవీ వ‌స్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.