Begin typing your search above and press return to search.
కోటిన్నర మంది మెచ్చిన స్టార్ హీరోయిన్ షార్ట్ ఫిల్మ్
By: Tupaki Desk | 1 Feb 2021 9:20 AM ISTహీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన షార్ట్ ఫిల్మ్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ మలయాళం మరియు తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మలయాళంలో 10 మిలియన్ లను క్రాస్ చేసి దూసుకు పోతుంది. మరో వైపు తెలుగు వర్షన్ షార్ట్ ఫిల్మ్ కూడా అరకోటికి పైగా వ్యూస్ ను దక్కించుకుంది. ఒక మహిళ మానసిక సంఘర్షణ ను చాలా చక్కగా దర్శకుడు చూపించడంతో పాటు ఆ పాత్రకు అనుపమ పరమేశ్వరన్ ప్రాణం పోసింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక సందేశాత్మక లేడీ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ ను తక్కువ సమయంలో కోటిన్నర మంది చూడటం అంటే మామూలు విషయం కాదు.
ఒక గృహిణిగా ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్కరిని చూసుకుంటున్న మహిళ ను ఆమె భర్త మోసం చేస్తున్నాడని.. అతడు మరో మహిళతో క్లోజ్ గా ఉంటున్నాడు అని తెలిసినప్పుడు ఆమె ఏం చేస్తుంది. ఆ సమయంలో ఆమె ఫీలింగ్ ఏంటీ అనేది షార్ట్ ఫిల్మ్ కథగా మలిచారు. రెండు పాత్రలతో సాగే షార్ట్ ఫిల్మ్ దాదాపుగా అరగంట పాటు ఉంది. తెలుగు మరియు తమిళ ఆడిన్స్ ముఖ్యంగా మహిళ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు.
అన్ని వర్గాల వారి దృష్టిని ఆకర్షించడంతో పాటు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా భారీ వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ఎండింగ్ కూడా చాలా విభిన్నంగా ఉంది. ప్రేక్షకులు క్లైమాక్స్ ను వారికి వారే ఊహించుకునే విధంగా చూపించారు. కనుక అందరు కూడా సినిమా ఎండింగ్ ను అభినందిస్తున్నారు. మొత్తానికి హీరోయిన్ గా బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్ తో మరింతగా అభిమానులకు చేరువ అయ్యింది.