Begin typing your search above and press return to search.

అనుపమ.. తెలుగు కుమ్మేసిందమ్మా

By:  Tupaki Desk   |   19 Dec 2016 6:28 AM GMT
అనుపమ.. తెలుగు కుమ్మేసిందమ్మా
X
శర్వానంద్ అనుపమ జంటగా నటించిన శతమానం భవతి.. రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం.. అనుపమా పరమేశ్వరన్. అందమైన హీరోయిన్ గా మాత్రమే కాదు.. తెలుగులో మాట్లాడి ఇరగదీసేసింది ఈ అమ్మాయి.

'అందరికీ నమస్కారం.. బాగున్నారా.. ఈ రోజు నా లైఫ్ లో చాలా స్పెషల్. శతమానం భవతి లాంటి ఒక మంచి చిత్రంలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉన్ను. నిత్య అనే కేరక్టర్ ని చాలా ఇష్టపడి ప్రతీ నిమిషం కష్టపడి చేశాను. దీని కోసం చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. నా దర్శకుడు సతీష్.. నిత్యగా నన్ను ఎంచుకున్నందుకు థాంక్యూ. మీతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్. ప్రొడ్యూసర్ రాజు గారు ఈ పాత్ర నాకు ఇచ్చినందుకే కాదు.. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ఎంతో కష్టపడ్డారు' అంటూ తెలుగులో చెప్పుకొచ్చింది అనుపమ.

'ఇక శర్వానంద్ గురించి ఏం చెప్పాలి. స్వీట్ స్టార్.. వండ్రఫుల్ కోస్టార్. నా స్నేహితుడు కూడా. నీతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ శర్వా. ప్రకాష్ రాజ్.. జయసుధ.. నరేష్ లాంటి ఎక్స్ పీరియన్స్ యాక్టర్స్ నటించేడం నా అదృష్టం. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక మేన్ ఆఫ్ ది డే మిక్కీ జే మేయర్.. నేను మీ పాటలతో లవ్ లో పడిపోయాను.' అంటూ అనుపమ చెప్పింది. వీటిలో ఇంగ్లీష్ మాటల కంటే తెలుగు మాటలే.. అదికూడా పర్ఫెక్ట్ తెలుగులో ఉండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/