Begin typing your search above and press return to search.

గ్లామర్ రోల్స్ చేయలేకే ఆ హీరోయిన్ ఇలా చేసిందా..?

By:  Tupaki Desk   |   4 April 2020 1:30 AM GMT
గ్లామర్ రోల్స్ చేయలేకే ఆ హీరోయిన్ ఇలా చేసిందా..?
X
అనుపమ పరమేశ్వరన్. తెలుగుతెరకు పరిచయం అక్కర్లేని పేరు. 'అఆ' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన నటనతో, క్యూట్ లుక్స్ తో లక్షలాది అభిమానుల అభిమానాన్ని చూరగొంటుంది. ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే అనుపమ విపరీతమైన క్రేజ్ తో, వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ వస్తుంది. మొదటి సినిమా నుండి సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటుంది అనుపమ. తెలుగులో దాదాపు యంగ్ హీరోల అందరితో నటించింది. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'రాక్షసుడు' సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది అనుపమ.

ప్రస్తుతం తెలుగు నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్ లో నటిస్తున్న ఈ మలయాళం బ్యూటీ, కొన్ని మలయాళం సినిమాలను కూడా ఓకే చేసిందట. తాజాగా అనుపమ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతోంది. అదేంటంటే.. అనుపమ రీసెంట్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీని ఓకే చేసిందట. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషించనుందట. ఈ సినిమాతో హనుమాన్ చౌదరి అనే కొత్త దర్శకుడు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇంకా మూవీ టైటిల్ ని ఫిక్స్ చేయలేదట. ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా, డిమాండింగ్ గా ఉండబోతుందట. అధికారికంగా ప్రకటించని అనుపమ కొత్త సినిమా వివరాలు త్వరలో తెలుస్తాయట. చూడాలి మరి అనుపమ ఎలాంటి సినిమాను ఓకే చేసిందో..