Begin typing your search above and press return to search.
రెండు పడవలపై యంగ్ బ్యూటీ?!
By: Tupaki Desk | 10 Jun 2019 6:04 AM GMTకథానాయికగా కెరియర్ గాడి తప్పితే ప్రత్యామ్నాయం ఎంచుకోవడం తెలివైన పని. ఈ విషయంలో చాలా అడ్వాన్స్ డ్ ప్లానింగ్ తో వ్యవహరిస్తూ ఓ యంగ్ హీరోయిన్ చూపిస్తున్న చొరవ అందరికీ సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇంతకీ ఎవరా యంగ్ బ్యూటీ? అంటే ఇంకెవరు.. ది గ్రేట్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఈ బ్యూటీ అటుపై వరుసగా సినిమాల్లో నటించింది. కానీ పరాజయాలు ఊపిరి సలపనివ్వలేదు. దాంతో ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. ప్రస్తుతం అనుపమ కెరియర్ డైలమా గురించి తెలిసిందే. ఇటు తెలుగు అటు మలయాళం రెండు చోట్లా అనుపమకు ఆశించిన కెరియర్ దక్కలేదు. ఆ క్రమంలోనే ఈ అమ్మడు ఫిలింమేకింగ్ పై దృష్టి సారించి ఏకంగా అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయింది.
త్వరలోనే మెగాఫోన్ చేపడతానని ఖరాకండిగా చెప్పేస్తోంది. ఇంతకీ అసిస్టెంట్ గా ఏ సినిమాకి పని చేస్తోంది? అంటే.. మలయాళంలో దుల్కార్ సల్మాన్ నిర్మిస్తున్న సినిమాకి సహాయ దర్శకురాలిగా జాయిన్ అయిపోయిందట. త్వరలోనే స్క్రిప్టు రాసుకుని సొంతంగా డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నానని తెలిపింది. ఇలా అయితే ఎలా? అభిమానులు ఫీలవుతున్నారు.. హీరోయిన్ గా నటించరా? అని ప్రశ్నిస్తే ... అబ్బే నటనకు ఏ అడ్డంకి లేకుండానే దర్శకత్వం వహిస్తానని తెలివిగా చెబుతోంది. అయితే రంగుల ప్రపంచంలో ఎవరూ ఏదీ నూమ్మూరు. రెండు పడవలపై కాళ్లు పెడితే ఏమవుతుందో తెలిసిందేగా.
పైగా సెంటిమెంటు పరిశ్రమ ఇలాంటి కొత్త స్టెప్ ని వెంటనే ఒప్పుకోదు. నటిస్తూ దర్శకత్వం వహిస్తానంటే హీరోయిన్లకు ఛాన్సొస్తుందా? ఇటూ అటూ ఊగితే కష్టమే.. ఛాన్స్ ఇస్తే ఏమవుతుందో అనే సందిగ్ధంలో పడిపోతారు కుర్రహీరోలు- డైరెక్టర్స్. మరి అనుపమ ఇవన్నీ తెలిసే ముందుకు వెళుతోందా? అలాగని ప్రయత్నాన్ని నిరాశపరచడం సరికాదు. ఆల్ ది బెస్ట్ టు అనుపమ!!