Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ ను చూసి కుళ్ళుకొని చస్తున్నారట

By:  Tupaki Desk   |   2 Jun 2019 4:17 AM GMT
ఆ డైరెక్టర్ ను చూసి కుళ్ళుకొని చస్తున్నారట
X
షూటింగ్ లొకేషన్ లో హీరోయిన్ల దర్జా మామూలుగా ఉండదని.. కాలు మీద కాలేసుకొని కూర్చుంటారని అంటూ ఉంటారు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం అలా ఉండడం లేదట. ఇప్పటివరకూ ఎలా ఉందో తెలియదు కానీ తన కొత్త సినిమా షూటింగ్ లో మాత్రం క్షణం కూడా వృధా చేయడం లేదట. అంటే ఏం చేస్తోంది?

అనుపమ హీరోయిన్ గా నటించడమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేస్తూ అందరినీ సర్ ప్రైజ్ చేస్తోందట. డీటెయిల్స్ లోకి వెళ్తే.. అనుపమ ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తోంది. ఈ చిత్రంతో షంసు జేబా అనే యువకుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారుతున్నాడు. అనుపమకు దుల్కర్ మంచి ఫ్రెండ్. దీంతో ఈ సినిమాకు ఖాళీ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తానని చెప్పిందట. దుల్కర్.. దర్శకుడు షంసు.. ఇద్దరూ అనుపమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో ఎడాపెడా అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోందట. ఇక చూసుకోండి .. ఆ డైరెక్టర్ ను చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారట. అలాంటి అందమైన అసిస్టెంట్ డైరెక్టర్ హేమహేమీలైన డైరెక్టర్లకే లేదు. మరి కుళ్ళుకోరా?

ఇదిలా ఉంటే అనుపమ తెలివితేటలను చాలామంది మెచ్చుకుంటున్నారు ఎందుకంటే.. హీరోయిన్ అంటేనే గ్లామర్. ఆ గ్లామర్ ఉన్నంతవరకే హీరోయిన్ ఛాన్సులు ఉంటాయి. ఆ తర్వాత తట్టాబుట్టా సర్దుకొనిపోవాల్సిందే. అదే ఇప్పటి నుంచి ఫిలిం మేకింగ్ లో మెళకువలు నేర్చుకుంటే డైరెక్టర్ గా ఫిలిం ఇండస్ట్రీలోనే కొనసాగవచ్చు కదా? అనుపమ అదే ప్లాన్ లో ఉందని.. భవిష్యత్తులో దర్శకురాలిగా అవతారం ఎత్తడం ఖాయమని అంటున్నారు.