Begin typing your search above and press return to search.

పవన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు

By:  Tupaki Desk   |   7 March 2016 8:02 AM GMT
పవన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పబ్లిసిటీకి, మీడియా హంగామాకి బాగా దూరంగా ఉండే వ్యక్తి. ఈ విషయాన్ని తనే స్వయంగా చాలాసార్లు చెప్పాడు. అసలు పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం అంటే తనకు మహా సిగ్గు కూడా అని చెప్పేస్తాడు. సినిమాల్లో మాత్రమే ఉన్నపుడు కాకుండా.. సీరియస్ గా రాజకీయాల్లోకి అడుగు పెట్టాక కూడా పవన్ ఇదే పంథాని కంటిన్యూ చేయడం విశేషం.

సినిమా రిలీజ్ కు ముందు పబ్లిసిటీ కోసం స్పెషల్ ఇంటర్వ్యూల్లాంటి వాటికి పవన్ చాలా దూరంగా ఉంటాడు. కానీ ఓ రచయిత - జర్నలిస్ట్ - బాలీవుడ్ క్రిటిక్ అయిన అనుపమా చోప్రా.. పవన్ కళ్యాణ్ ని ఇంటర్వ్యూ కి ఒప్పించింది. ఆ ముహూర్తం కూడా ఎప్పుడో కాదు. ఇవాళే పవన్ ని స్పెషల్ ఇంటర్వ్యూ చేయనుంది. ఇందుకోసం పవన్ అభిమానుల నుంచి ప్రశ్నలు కూడా అడిగి తెప్పించుకుంది. మరి ఈ ఇండర్వ్యూ లో పవన్ కి ఎలాంటి ప్రశ్నలు వస్తాయ్.. వాటికి పవర్ స్టార్ ఎలాంటి సమాధానాలిస్తాడనే ఆసక్తి ఎక్కువైపోతోంది. ఎందుకంటే పవన్ గురించి జనం తెలుసుకోవాలని అనుకుంటున్న సంగతులు చాలానే ఉంటాయి.

మొదట సినిమాలతో మొదలుపెట్టినా, పవన్ వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ కంటిన్యూ చేస్తాడా ఆపేస్తాడా.. రాజకీయాల్లో నెక్ట్స్ స్టెప్ ఏంటి.. జనసేనను స్టార్ట్ చేసి రెండేళ్లయిన సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు లాంటి.. అనేక జవాబులు తెలియని ప్రశ్నలకు పవన్ నుంచి ఆన్సర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు.