Begin typing your search above and press return to search.
అయ్యో! సడెన్ గా హ్యాండిస్తుందా ఏంటీ?
By: Tupaki Desk | 22 Dec 2022 4:35 AM GMTకథానాయికలుగా ఓ వెలుగు వెలిగాక దర్శకత్వంలోను సత్తా చాటాలని కోరుకునే భామలకు కొదవేమీ లేదు. నియాన్ కాంతుల వెలుగు జిలుగుల్లో ఆర్క్ లైట్ల క్రీనీడలో మేకప్ ముఖాలతో నిరంతరం కఠినంగా శ్రమించే తారలకు దర్శకత్వ శాఖతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ శాఖలో ఏది ఎలా హ్యాండిల్ చేయాలో కూడా పరిశీలించే వీలుంటుంది. దీంతో తమను తాము దర్శకులుగా ఆవిష్కరించుకుంటే పరిశ్రమలో ఫేడవుట్ అయ్యే ఛాన్సుండదని కూడా కొందరు భావిస్తుంటారు.
ఒక రకంగా దీపం ఆరకుండానే (నటిగా కెరీర్ సున్నా అవ్వకముందే) ముందస్తు ఆలోచనగా దీనిని చూడాలి. చాలా మంది సీనియర్ నటీమణులు కథానాయికలుగా అవకాశాలు తగ్గాక దర్శకులుగా మారారు. విజయ నిర్మల.. రేవతి ..సుహాసిని.. షబానా ఆజ్మి తదితర సీనియర్లు దర్శకులుగా సత్తా చాటారు.
ఇప్పుడు అదే బాటలో వెళ్లాలని ఆశపడుతోంది అందాల అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ మలయాళీ బ్యూటీ కెరీర్ కాస్త నెమ్మదిగా సాగుతున్న క్రమంలో తన మైండ్ లోకి విలక్షణ ఆలోచనలు ప్రవేశించాయని కూడా అర్థమవుతోంది.
నిజానికి అనుపమ పరమేశ్వరన్ నటనా నైపుణ్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇటీవలి కాలంలో పాత్రల ఎంపిక పరంగా మరింత ప్రయోగాత్మకంగా మారింది. కార్తికేయ 2లో యాక్షన్ క్వీన్ గా మారి ఆకట్టుకునే పాత్రలో నటించింది. అంతకుముందు 'రౌడీ బాయ్స్'లో లిప్ లాక్ వేసి హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ లో '18 పేజెస్'లో విద్యార్థిగా.. అందమైన ప్రేమికురాలిగా నటించింది.
ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రచారంలో బిజీబిజీగా ఉంది అనుపమ. అయితే కేవలం నటిగానే కొనసాగుతారా? లేక ఇంకేవైనా ఆలోచనలున్నాయా? అన్న ప్రశ్న ఎప్పటిలానే తనకు మీడియా నుంచి ఎదురైంది. నిజానికి అనుపమకు నటన మాత్రమే కాదు ఇతర నైపుణ్యాలు ఉన్నాయని తాజాగా రివీలైంది. తాను తీరిక వేళల్లో ఊహాజనితమైన కల్పిత కథలను రాస్తుందట. అంతేకాదు ఏదో ఒక రోజు వీటిని డైరెక్ట్ చేసే ఆలోచన కూడా ఉందని తెలిపింది. ఎట్టకేలకు సినీ దర్శకత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అనుపమ కోరుకుంటోందని స్పష్టమైంది.
''దీనికోసం దర్శకుల క్రింద పని చేయాలి... రోప్ లు నేర్చుకోవాలి.. ''అంటూ తన ప్రణాళికను అనుపమ వివరించింది. నేను మెగాఫోన్ పట్టే ముందు నాకు కొంచెం అనుభవం కావాలి! అని కూడా అంది. అయితే అనుపమ ఇంకా ఏజ్ బార్ కాదు. ఇంకా మూడు పదుల వయసులో కి రానే లేదు. తనకు కథానాయికగా గొప్ప భవిష్యత్ ఉంది. అగ్ర హీరోయిన్ హోదాను అందుకునేందుకు ఆస్కారం లేకపోలేదు.
ఇంతకుముందు చరణ్- సుక్కూ కాంబో 'రంగస్థలం' ఆడిషన్స్ లో అవకాశాన్ని కోల్పోయింది. కానీ ఇప్పుడు అలాంటి మరో అవకాశం తన దరికి వస్తే ఒడిసిపట్టి నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ డాగ్ హాజ్ ఏ డే.. అలాంటి ఒక రోజొస్తుంది.. అంతవరకూ అనుపమ ఎదురు చూడాలి!! కెరీర్ డల్ ఫేజ్ లో దర్శకత్వ శాఖ ఎలానూ అందుబాటులో ఉంటుందిగా!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.