Begin typing your search above and press return to search.

డైరెక్టర్ల‌ మ‌ధ్య త‌న్నుకునే రేంజ్ లో ట్విట‌ర్ వార్!

By:  Tupaki Desk   |   15 Dec 2022 11:45 AM GMT
డైరెక్టర్ల‌ మ‌ధ్య త‌న్నుకునే రేంజ్ లో ట్విట‌ర్ వార్!
X
బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ఇటీవ‌ల సౌత్ సినిమాల్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాది సినిమాలు ఇండ‌స్ర్టీని స‌ర్వ నాశ‌నం చేస్తున్నాయ‌ని కామెట్లు చేసారు. అలాగే `పుష్ప‌`..`కాంతార` లాంటి సినిమాలు ప్రేక్ష‌కుల్ని మార్చేసాయని..ఇక‌పై సినిమాలు చేయాలంటే మేకింగ్ శైలి సైతం ద‌ర్శ‌కులు మార్చుకోవాల్సిందేన‌ని....ఇది ఇండస్ర్టీకి సంక‌టంగా మారింద‌న్నారు.

ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే కౌంట‌ర్లు వేయాల్సిన వాళ్లు వేసేసారు. సొంత భాషా ద‌ర్శ‌కులే ఆయ‌న‌కు చీవాట్లు కూడా పెట్టారు. తాజాగా అనురాగ్ క‌శ్య‌ప్ పై బాలీవుడ్ సంచ‌ల‌న దర్శ‌కుడు వివేక్ అగ్ని హోత్రి త‌న‌దైన శైలిలో బ‌ధులిచ్చాడు. అనురాగ్ వ్యాఖ్య‌ల‌తో నేను ఏకీభవించ‌ను. ఇండ‌స్ర్టీని సౌత్ సినిమాలు మార్చేయ‌డం ఏంటి? నాన్సెన్స్! అంటూ గ‌ట్టిగానే త‌గులుకున్నారు.

దీనికి బ‌ధులుగా అనురాగ్ కాస్త త‌గ్గిన‌ట్లే త‌గ్గి చుర‌క‌లు వేసే ప్ర‌య‌త్నం చేసాడు. `సార్ ఇది మీ తప్పు కాదు. మీ సినిమాల రీసెర్చ్ అనేది నా సంభాషణలపై మీరు చేసిన ట్వీట్ తరహాలోనే ఉంది. మీ పరిస్థితి.. మీ మీడియా పరిస్థితి కూడా అలాగే ఉంది. తదుపరి సార్ కొంత తీవ్రమైన రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అని అనురాగ్ కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు.

దీంతో వివేక్ సీన్ లోకి చెడుగుడు ఆడేసారు. `ది కాశ్మీర్ ఫైల్స్` సినిమా కోసం నాలుగు సంవత్సరాల పాటు చేసిన రీసెర్చ్ అంతా అబద్దం అని నిరూపించండి. అలాగే గిరిజా టికూ.. బికె గంజు.. ఎయిర్‌ఫోర్స్ హత్య.. నడిమార్గ్ - అన్నీ అబద్ధాలేదనా.. 700 మంది పండితుల వీడియోలన్నీ అవాస్త‌వాలేనా? హిందువులు ఎవరూ చనిపోలేదంటారా? ముందు మీ స‌హా మీలాంటి వాళ్లు అంద‌రూ దీన్ని నిరూపించండి.

ఆత‌ర్వాత నేను మరోసారి తప్పు చేయను అని అగ్నిహోత్రి కౌంట‌ర్ వేసారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు నెట్టింట‌..నెటి జ‌నుల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాడిని త‌న్నే వాడుంటే..వాడి త‌ల‌ని కూడా త‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు అన్న సంగ‌తి ఇప్ప‌టికైనా గ్ర‌హిస్తే మంచిదంటూ నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.