Begin typing your search above and press return to search.

తాప్సి యావరేజ్ అంటా..

By:  Tupaki Desk   |   17 April 2018 5:29 PM GMT
తాప్సి యావరేజ్ అంటా..
X
ఝుమ్మంది నాథం సినిమాతో మంచి హిట్ అందుకోక పోయినా హీరోయిన్ తాప్సి మాత్రం క్రేజ్ గట్టిగానే అందుకుంది. ఆమె పడిన కష్టానికి ప్రశంసలు చాలానే అందాయి. ఆఫర్స్ కూడా గట్టిగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నంత రేంజ్ లో ఆమెకు భారీ ఆఫర్స్ ఏమి అందలేదు. వచ్చిన అవకాశాల్లో కూడా మరో స్టార్ హీరోయిన్ తో మంచుకోవాల్సి వచ్చింది. ఆమె చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి గాని ఒక విధంగా ఆమె అందానికి మాత్రం ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అందలేదు.

కానీ రీసెంట్ గా ఆమెకు సోషల్ మీడియా నుంచి మాత్రం ఊహించని విధంగా ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె అందంపై సెటైర్ వేసిన నెటీజన్ కి తనదైన శైలిలో తాప్సి కౌంటట్ ఇచ్చింది. ముందుగా తాప్సి మన్మర్జియా అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై కొంచెం పాజిటివ్ టాక్ ఉంది. అయితే తాప్సి అనురాగ్ కశ్యప్ తో ఫొటో దిగి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఫొటోలో తాప్సి స్నాక్స్ తింటూ కనిపించింది. అయితే ఎవరికి నచ్చినట్టుగా వారు కామెంట్ చేశారు.

అయితే ఓ నెటీజన్ మాత్రం నీకు మొదటి అవకాశం ఎవరు ఇచ్చారు. నువ్ చాలా యావరేజ్ గా ఉంటావ్ అని చెప్పాడు. దీంతో తాప్సి అవును నేను యవారేజ్ గానే ఉంటాను. బహుశా మొదటి నా నటనకు మెచ్చి అవకాశం ఇచ్చి ఉంటారు అని చెప్పింది. అంతే కాకుండా యావరేజ్ అనేది తక్కువేమీ కాదు. అదో పెద్ద కేటగిరీ అంటూ తాప్సి కౌంటర్ ఇచ్చేసింది. ప్రస్తుతం తాప్సికి బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. జూడ్వా 2 హిట్ తో తాప్సికి మంచి గుర్తింపు దక్కింది. మరి ఇలాంటి టైమ్ లో అలాంటి నెగిటివ్ కామెంట్స్ తాప్సికి ఎందుకు వస్తున్నాయో..