Begin typing your search above and press return to search.

బాలీవుడ్ డైరెక్టర్.. మూడో పెళ్లికి రెడీనా?

By:  Tupaki Desk   |   15 Jun 2017 7:19 AM GMT
బాలీవుడ్ డైరెక్టర్.. మూడో పెళ్లికి రెడీనా?
X
కొంచెం క్రియేటివిటీ ఎక్కువగా సినిమా వాళ్లు రిలేషన్ షిప్స్ లో వీక్ గా ఉంటారని.. నిలకడగా ఉండలేరని ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. కమల్ హాసన్ దగ్గర్నుంచి చాలా ఉదాహరణలే కనిపిస్తాయి ఈ విషయంలో. బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ కోవలోకే వస్తాడు. ‘దేవ్ డి’.. ‘గర్ల్ ఇన్ ద ఎల్లో బూట్స్’.. ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’.. ‘రమణ్ రాఘవ్ 2.0’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్.. ఈ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు.

ముందుగా ఆర్తి అనే అమ్మాయిని పెళ్లాడి తన నుంచి 2009లో విడిపోయిన కశ్యప్.. ఆ తర్వాత కల్కి కొచ్లిన్ తో డేటింగ్ చేశాడు. ఆమెను 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరి వివాహ బంధం నాలుగేళ్లకు మించి సాగలేదు. ఆమె నుంచి విడిపోయాక తన వయసులో దాదాపు సగం ఉన్న శుభ్ర శెట్టి అనే అమ్మాయితో కొంత కాలంగా కశ్యప్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. వీళ్లిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటూ రొమాన్స్ చేస్తున్న ఫొటోలు కొన్ని బయటికి వచ్చాయి. కశ్యప్ స్వయంగా వీటిని బయటపెట్టడం విశేషం. కశ్యప్ వయసు 44 కాగా.. శుభ్ర వయసు 23 ఏళ్లే. తన కొత్త లవ్ లైఫ్ గురించి ఊహాగానాలు ఎందుకని.. కశ్యప్ స్వయంగా ఇలా క్లారిటీ ఇచ్చేసినట్లున్నాడు. మరి శుభ్రతో రిలేషన్ షిప్ ఎక్కడిదాకా వెళ్తుందో.. కశ్యప్ తన మూడో పెళ్లికి రెడీ అయిపోతాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/