Begin typing your search above and press return to search.
నిన్న యముడిని కలిస్తే భూమ్మీద పడేశాడు.. వార్నీ డైరెట్రూ..!
By: Tupaki Desk | 15 Sep 2020 12:30 AM GMTయముడినే భయపెట్టిన యముండ లాంటి డైరెక్టరు! ఇంతకీ ఎవరీయన? అంటారా? అయితే వివరాల్లోకి వెళ్లాలి. నిరంతరం సినిమాలు రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పే అనురాగ్ కశ్యప్ కి సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అంతకు మించి హేటర్స్ కూడా ఉన్నారు.
అయితే అలాంటి వైరల్ వేదికపై నిన్నంతా జరిగిన ప్రచారం చూస్తే షాక్ తినాల్సిందే. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆకస్మికంగా మరణించారు! అంటూ ఒకటే ప్రచారం హోరెత్తిపోయింది. దీంతో ఖంగు తిన్న అభిమానులు కంగారు పడి సంతాపం కూడా చెప్పేశారు. అయితే చాలామంది ఇది డమ్మీ ప్రచారమా? అతడి ప్రత్యర్థుల కుట్రనా? దుష్ట ప్రచారమా? అంటూ ఆరాలు తీసారు.
చివరికి ట్విట్టర్ లో తప్పుగా ప్రచారమైందని తర్వాత తెలిసింది. దీనిపై అనురాగ్ కూడా తాజాగా స్పందించాడు. అతడి స్పందన ఎంతో ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ``నిన్న యమరాజ్ కలుసుకున్నారు. ఈ రోజు యమరాజ్ స్వయంగా నన్ను నా ఇంటి వద్ద పడేశాడు. మీరు ఎక్కువ సినిమాలు చేయాలి. మీరు సినిమా చేయకపోతే .. అంధ భక్తులు మీ సినిమాలను ఎలా బహిష్కరించగలరు?`` అంటూ ఎంతో ఫన్నీ గా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది. చావు కబురును కూడా పుట్టినరోజులా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇదే సుమీ!