Begin typing your search above and press return to search.

ఆపరేషన్‌ తో గుర్తు పట్టనంతగా మారిన స్టార్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   31 May 2021 4:40 AM GMT
ఆపరేషన్‌ తో గుర్తు పట్టనంతగా మారిన స్టార్‌ డైరెక్టర్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఆయన కూతురు షేర్‌ చేసిన ఒక వీడియో ఆయన అభిమానులకు షాకింగ్ గా మారింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న అనురాగ్‌ కశ్యప్‌ త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుని సినిమా లను మొదలు పెడతాడని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన లుక్‌ షాకింగ్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అనురాగ్‌ కశ్యప్‌ కు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. దాంతో ఆయనకు ఇటీవల ఆంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఇటీవలే మేనేజర్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సరదా సమయాన్ని గడుపుతూ పూర్తి విశ్రాంతిలో ఉన్న అనురాగ్‌ కశ్యప్ ఉన్నట్లుండి కూతురు ఆలియా ఇన్‌ స్టా హ్యాండిల్ లో కనిపించాడు. అందులో ఆయన లుక్‌ మరీ షాకింగ్‌ గా ఉంది. పూర్తిగా గుండు చేయించుకుని ఉన్నారు. అలాగే ఆయన కను బొమ్మలు నిండుగా ఒత్తైన గడ్డంతో ఇతడు అతడేనా అన్నట్లుగా ఆశ్చర్యం కలిగించేలా కనిపించాడు. బాలీవుడ్‌ లో ఎన్నో సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్న అనురాగ్‌ కశ్యప్‌ ప్రస్తుతం మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.

వరుసగా పెద్ద హీరోలతో మరియు చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న అనురాగ్‌ కశ్యప్‌ అనూహ్యంగా అనారోగ్యం బారిన పడటంతో ఆయన అభిమానులు ఒకాకొన సమయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం విషయంలో మేనేజర్‌ క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాని ఈ లుక్ లో ఆయన్ను చూసి కొందరు అభిమానులు ఆందోళన చెందుతూ కామెంట్స్ చేస్తున్నారు.