Begin typing your search above and press return to search.

అవును.. ఆ దర్శకుడు అలాంటోడే

By:  Tupaki Desk   |   7 Oct 2018 11:40 AM GMT
అవును.. ఆ దర్శకుడు అలాంటోడే
X
హాలీవుడ్.. బాలీవుడ్.. టాలీవుడ్ అని తేడా లేకుండా.. కొంత కాలం నుంచి సినీ రంగంలో మహిళలపై జరిగే వేధింపుల విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. పలువురు మహిళలు తమకు ఈ రంగంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఓపెన్ అవుతున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్ భామ తనూశ్రీ దత్తా.. సీనియర్ నటుడు నానా పటేకర్ మీద చేసిన వ్యాఖ్యలు ఎంతటి ప్రకంపనలు రేపుతున్నాయో తెలిసిందే. మరోవైపు ‘క్వీన్’ సినిమా రూపొందించిన దర్శకుడు వికాస్ బల్ మీద ఓ నటి చేసిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో ముందు అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. ఇప్పుడు వ్యవహారం తీవ్ర స్థాయికి చేరింది. వికాస్ భాగస్వామిగా ఉన్న ‘ఫాంటమ్’ సంస్థ ఈ వివాదం కారణంగానే మూత పడే పరిస్థితి వచ్చింది.

ఈ సంస్థలో భాగస్వామి అయిన అనురాగ్ కశ్యపే స్వయంగా వికాస్‌ ను తప్పుబట్టాడు. ఈ ఇష్యూను తాము సరిగా డీల్ చేయలేకపోయామన్నాడు. మరోవైపు వికాస్‌ తో కలిసి ‘క్వీన్’ సినిమా చేసిన కంగనా రనౌత్ సైతం బాధిత మహిళకు అండగా నిలిచింది. వికాస్ మంచోడు కాదని ఆమె అభిప్రాయపడింది. వికాస్ చూపులు ఎప్పుడూ సరిగా ఉండేవి కాదని కంగనా చెప్పింది. అతను కొన్నిసార్లు గట్టిగా కౌగిలించుకుని జుట్టు వాసన చూసి అది చాలా బాగుందని అనేవాడంది. వికాస్‌ కు ఎప్పుడో పెళ్లయినా కూడా.. రోజూ ఓ అమ్మాయి కావాలన్నట్లు వ్యవహరించేవాడని కంగనా చెప్పింది. వికాస్‌ పై బాధిత మహిళ చేసిన ఆరోపణల్లో నిజం ఉందేమో అనిపిస్తోందని కంగనా చెప్పింది. వికాస్ కొన్నాళ్ల కిందట తనతో మళ్లీ ఓ సినిమా చేయడానికి స్క్రిప్టతో వచ్చాడని.. కానీ తాను అతడిపై ఆరోపణలు చేసిన మహిళకు సపోర్టివ్వడంతో మళ్లీ తన వైపు చూడలేదని ఆమె వెల్లడించింది.