Begin typing your search above and press return to search.

ఐష్‌ తో స్నేహం ఏజ్ గ్యాప్ మహిమే

By:  Tupaki Desk   |   19 Sep 2016 11:30 AM GMT
ఐష్‌ తో స్నేహం ఏజ్ గ్యాప్ మహిమే
X

రెండు కొప్పులు ఒక చోట చేరితే.. సఖ్యతగా ఉండడం కష్టం అంటారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు ఓ సినిమా చేస్తున్నా సరే.. వారి రేంజ్ లో గ్యాప్ కారణంగా కలిసిపోవడం కష్టమే. కానీ 'యే దిల్ హై ముష్కిల్' లో నటించిన ఐశ్వర్యారాయ్.. అనుష్క శర్మలు కలిసి పోవడం అంత ముష్కిల్ మాత్రం కాలేదట.

మొత్తం షూటింగ్ లో విబేధాలే కాదు.. చిన్నపాటి వాదన కూడా ఎప్పుడూ చోటు చేసుకోలేదని తెలుస్తోంది. ఇందుకు కారణం.. షూటింగ్ మొదటి రోజునే వీళ్లిద్దరూ కలిసిపోవడమేనట. అసలు షాట్ గ్యాప్ వస్తే చాలు కబుర్లలో పడిపోయారట ఈ ముద్దుగుమ్మలిద్దరూ. ఇక ఒకరినొకరు అభినందించుకోవడం.. ఒకరి యాక్టింగ్ ను మరొకరు ప్రశంసించుకోవడం.. పాత విజయాలను గుర్తు చేసుకోవడం లాంటివి అయితే కోకొల్లలు అంటున్నారు ఈ సినిమా మేకర్స్. లండన్ లో ఈ మూవీని ఎక్కువ భాగం షూట్ చేయగా.. 'అనుష్క లుక్స్ ని స్టైల్ ని అందరిముందు ఐశ్వర్య పొగిడినప్పుడు.. ఆమె కదిలిపోయింది' అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కుర్ర హీరో రణబీర్ కపూర్ తో ఈ హీరోయిన్ల కెమిస్ట్రీ ఏమో కానీ.. వీళ్లద్దరికీ ఫ్రెండ్ షిప్ బాగానే వర్కవుట్ అయిపోయిందన్నమాట.

చూశారా.. బాలీవుడ్డులో ఇద్దరు హీరోయిన్లు కలిసిపోయారు అంటే అది ఎంత పెద్ద న్యూస్ అవుతుందో. ఇద్దరి మధ్య కామన్ గా గొడవలు ఉండడం అనేదే అక్కడి సహజ లక్షణం. అటువంటిది కలసి ఫ్రెండ్‌ షిప్ అంటే.. మేబీ ఐష్‌ (42) అనుష్క (28) ఏజ్ గ్యాప్ మహిమేమో!!