Begin typing your search above and press return to search.

ఇక్కడ అనుష్కకు, అక్కడ కత్రినకు

By:  Tupaki Desk   |   31 Aug 2015 3:38 AM GMT
ఇక్కడ అనుష్కకు, అక్కడ కత్రినకు
X
కనిపిస్తే చాలు .. కావ్‌ కావ్‌ మంటూ కాకుల్లా పొడుచుకు తింటున్నారు. మాయదారి లోకం ఇది. అసలు బ్యాచిలర్‌ లను బతకనియ్యరు. పెళ్లెప్పుడు? అంటూ పొడుచుకు తినడమే జనం పని. పాపం ఇక్కడ అనుష్కకు, అక్కడ కత్రినకు ఇప్పట్లో ఈ బెడద తప్పేట్టే లేదు. స్వీటీ ఎక్కడ కనిపించినా హాయ్‌ స్వీటీ! పెళ్లెప్పుడు? అని యథాలాపంగా అడిగేస్తున్నారంతా. వయసు ముదిరినా, బెండ ముదిరినా అంతే సంగతి అంటూ ఏడిపించేస్తున్నారు.

సేమ్‌ టు సేమ్‌ కత్రిన పరిస్థితి కూడా ఇదే. ఎందుకమ్మా? ఆలస్యం.. రణబీర్‌ తో పెళ్లెప్పుడు? త్వరగా కానిచ్చెయ్‌! అంటూ సలహాలిచ్చేవాళ్లు ఎక్కువైపోయారు. నిన్నటిరోజున 'ఫాంటమ్‌' ప్రమోషన్‌ కార్యక్రమంలో ఇదే సమస్య తలెత్తింది. పెళ్లి అనేది తనకి సమస్యగానే మారిపోయిందని అనుకుందో ఏమో కత్రిన వెంటనే తెలివైన సమాధానం చెప్పింది.

కెరీర్‌ లో ఒక్క జాతీయ అవార్డు అందుకోనివ్వండి. తస్సదియ్యా వెంటనే పెళ్లి చేసేసుకుంటా. .. అంటూ తెలివైన మెలిక వేసింది. అసలు జాతీయ అవార్డు అంటే ఎప్పుడు పనవుతుందో చెప్పలేం కదా! అది వచ్చేలోగా కెరీర్‌ ముగిసిపోయినా ముగిసిపోవచ్చు. ఇక అదే చెత్త ప్రశ్న తనని పదే పదే వేదించకుండా ఇలా టాక్టికల్‌ ఆన్సర్‌ ఇచ్చిందన్నమా! వామ్మో !! ఇదే ఐడియాని స్వీటీ అనుష్క కూడా కాపీ కొట్టేస్తుందేమో? కత్రిన రణబీర్‌ ని పెళ్లాడాలంటే ముందు అతడి సరసన జగ్గా జాసూస్‌ చిత్రాన్ని పూర్తి చేయాలి. అనుష్క చిక్కుముడులు వేరే ఉన్నాయిలే!?.. అదేంటో తెలిసేవరకూ.. వెయిట్‌ టిల్‌ దెన్‌!