Begin typing your search above and press return to search.
2015 స్వీటీ తర్వాత నిత్యా సొంతం
By: Tupaki Desk | 31 Dec 2015 6:39 AM GMT2015లో టాప్-1 - టాప్-2 హీరోయిన్‌లను ఫిక్స్ చేయాలంటే ఏ పేర్లు వినిపిస్తాయి? ఠకీమని చెప్పేయండి.. అంటే కాస్తంత తడుముకుంటారేమో! కానీ అంత అవసరం లేదిక్కడ. ఎప్పటిలానే ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా వెలిగిపోయింది స్వీటీ. జయాపజయాలతో సంబంధం లేకుండా వార్తల్లో కథానాయికగా స్వీటీ పేరే ఎక్కువగా వినిపించింది. బాహుబలిలో దేవసేన గెటప్పుకి - రుద్రమదేవిగా వారియర్ క్వీన్ ఆహార్యంతో అద్భుతంగా ఆకట్టుకుంది. సైజ్ జీరో స్వీటీగానూ దుమ్ము దులిపేసింది. అందుకే స్వీటీని క్వీన్ ఆప్ ది ఈయర్ గా ఫిక్స్ చేసేశారు ఈ జనం.
ఇక ఆ తర్వాతి పొజిషన్ లో ఎవరిని ఎంపిక చేయాలి అనుకుంటే తమన్నా - సమంత - రకూల్ - రాశీ వీళ్ల పేర్లేవీ వినిపించడం లేదు మరి. వీళ్లందరినీ మించిన గొప్ప పెర్ఫామెన్స్ చేసింది మాత్రం నిత్యామీనన్. ఈ రింగుల జుత్తు సుందరి మిగతావారి కంటే డిఫరెంట్ క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని అదరగొట్టేసింది. ముఖ్యంగా గంగ సినిమాలో ఫిజికల్లీ హ్యాండీకేప్డ్ పాత్రలో జీవించిందంటే అతిశయోక్తి కాదు. పెళ్లి కాలేదన్న వ్యథతో ఉండే డిజేబుల్డ్ అమ్మాయిగా నిత్యా కంట తడి పెట్టించే పెర్ఫామెన్స్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఏడాది మొత్తంలో నంబర్ -1 పెర్ఫామెన్స్ ఇదే.
అలాగే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో కాస్తంత ఏజ్డ్ ఉమెన్ గా కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఓకే బంగారంలో క్యూట్ లవర్ గా మోడ్రన్ గాళ్ గా మెప్పించింది. ఇక రుద్రమదేవి చిత్రంలో రుద్రదేవుడి పెళ్లాం పాత్రలో వారెవ్వా అనిపించింది. సన్నాఫ్ సత్యమూర్తిలో సైతం నేను ఉండగా, మీరెవరూ నాకు సాటిరారు అన్నట్టే ముగ్గురు భామల మధ్య కనిపించి మెప్పించింది. అందుకే నిత్యానే నంబర్ -2 అని ఫిక్సవ్వాల్సిందే మరి.